శ్రీను వైట్ల- మంచు విష్ణు కాంబినేషన్లో వచ్చిన “ఢీ” సినిమా సూపర్ హిట్ అయింది. ఆ సినిమాతో మంచు విష్ణు హీరోగా మంచి పేరు సంపాదించాడు. దీంతో అదే కాంబినేషన్‌ను మళ్లీ రిపీట్ చేయనున్నాడు విష్ణు. విష్ణు పుట్టిన రోజు సందర్భంగా తన నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేశాడు విష్ణు. శ్రీను వైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా “డబుల్ డోస్”{ఢీఢీ} మూవీని ప్రకటించారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మంచు విష్ణు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే.. ఈ సినిమా నుంచి ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్గా ఇద్దరు పేర్లు అనుకుంటున్నారట శ్రీను వైట్ల. ప్రధాన కథానాయిక పాత్ర కోసం ఇమ్మాన్యుయేల్ లేదా ప్రగ్యా జైస్వాల్లో ఎవరో ఒకరిని మొదట అనుకున్నారట. కానీ ప్రగ్యా జైస్వాల్ అయితే… బాగుంటుందని కొందరు చెప్పడంతో శ్రీను వైట్ల ఆమెకే ఓకే చెప్పేశాడట. దీని కోసం శ్రీను వైట్ల… ఇప్పటికే విష్ణును ఒప్పించేశాడని సమాచారం. కాగా.. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
previous post
next post
తప్పు ఎక్కడ జరుగుతోందో అర్థం కావడం లేదు : శర్వానంద్