telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్న టాలీవుడ్…

మన టాలీవుడ్ కు సీఎం కేసీఆర్‌ భరోసా కల్పించిన విషయం తెలిసిందే. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా అధికార తెరాస మేనిఫెస్టోలో టాలీవుడ్‌కు కూడా స్థానం కల్పించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు పలు హామీలు ఇచ్చారు. కరోనా దెబ్బతో తీవ్ర ఆర్థిక నష్టాలు చవిచూసిన టాలీవుడ్‌ను కాపాడుకోవటానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని కేసీఆర్‌ అన్నారు. ప్రభుత్వపరంగా రాయితీలు, మినహాయింపులు ఇస్తామని ప్రకటించారు. ఈ  క్రమములోనే సినిమా థియేటర్ల ఓపెనింగ్‌కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 50 శాతం సీటింగ్‌తో తెలంగాణలో సినిమా థియేటర్లకు అనుమతి ఇస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ సర్కార్. మాస్కులు, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలని సూచించింది. థియేటర్ రీఓపెన్, హామీలపైనా సినీ ప్రముఖులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ స్పందిస్తున్నారు.. మెగా స్టార్ చిరంజీవి ట్వీట్ చేస్తూ.. కరోనాతో కుదేలైన సినిమారంగానికి వరాల జల్లు కురిపించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, కష్టసమయంలో ఇండస్ట్రీకి తోడుగా నిలుస్తున్నారంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ను తనయుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ రీట్వీట్ చేస్తూ.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానంటూ తెలియజేశాడు. కింగ్ నాగార్జున స్పందిస్తూ.. కోవిడ్ లాంటి అనిశ్చిత సమయాల్లో తెలుగు చిత్ర పరిశ్రమకు అవసరమైన సహాయక చర్యలకు తోడ్పడుతున్న సీఎం కెసిఆర్ కి కృతజ్ఞతలు అంటూ ట్విట్స్ చేస్తున్నారు.

Related posts