telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం…

దేశంలో కరోనా కేసులు, చలి తీవ్రత పెరిగిపోతుండటంతో తోడు ఢిల్లీ, రాజస్తాన్, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలు దీపావళి టపాసులపై ఆంక్షలు విధించాయి. కానీ తాజాగా దీపావళి పటాకుల నిషేధంపై కర్ణాటక సర్కార్‌ వెనక్కి తగ్గింది.. క్రాకర్స్‌పై బ్యాన్‌ విధిస్తున్నట్లు ప్రకటించిన 8 గంటలకే… నిబంధనలు మార్చింది. పర్యావరణకు హాని కలిగించనివి కాల్చుకోవచ్చని సూచించింది. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా… ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటూ పండగ జరుపుకోవాలని సూచించింది. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేసింది కర్ణాటక ప్రభుత్వం. కాగా.. కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. ప్రస్తుతం దేశంలో చలి పంజా విసురుతోంది. చలి తీవ్రత పెరిగిపోతుండటంతో కేసులు పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక దేశంలో అతి ముఖ్యమైన, పెద్దవైన పండగల్లో దీపావళి కూడా ఒకటి. కాగా.. దీపావళి సందర్భంగా కాల్చే టపాసులపై కూడా దృష్టిసారించాయి ప్రభుత్వాలు. ఇక ఈ ఏడాది దీపావళి చేసుకోకపోతే వచ్చే ఏడాది ఘనంగా చేసుకోవచ్చని కాలుష్యం నుంచి బయటపడితే కరోనా వ్యాప్తి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

Related posts