మలయాళంలో సూపర్ హిట్ అయిన కథలు తెలుగులోకి రావడం కొత్తేమీ కాదు. ఇప్పటికే చిరంజీవి కోసం ‘లూసిఫర్’ హక్కుల్ని మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ సొంతం చేసుకున్నాడు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’ కూడా మలయాళ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఇటీవల వచ్చిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ అనే మలయాళ చిత్రం హక్కుల్ని సొంతం చేసుకుంది. అక్కడ అగ్ర కథానాయకుడు పృథ్వీరాజ్ ఈ మూవీ మొయిన్ లీడ్ లో నటించారు. తెలుగులోనూ సీనియర్ స్టార్ హీరో ఈ కథలో నటించే అవకాశాలున్నాయి. తాజాగా నట సింహా నందమూరి బాలకృష్ణ పేరు ప్రచారంలోకి వచ్చింది. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.
							previous post
						
						
					
							next post
						
						
					

