నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన చిత్రం నేషనల్ ఆర్ట్స్ వారి “పిచ్చి పుల్లయ్య” 17-07-1953 విడుదలయ్యింది.
ఎన్టీఆర్ గారి సోదరులు నందమూరి త్రివిక్రమరావు గారు నిర్మాత గా నేషనల్ ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు తాతినేని ప్రకాశ రావు గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే: తాతినేని ప్రకాశరావు, పాటలు, మాటలు: అనిశెట్టి సుబ్బారావు, సంగీతం: టి.వి. రాజు, ఫోటోగ్రఫీ: ఎం.ఏ.రహమాన్, కళ: ఎస్. కృష్ణారావు, నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి, ఎడిటింగ్: జి.డి.జోషీ, అందించారు.
ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, షావుకారు జానకి, కృష్ణకుమారి, గుమ్మడి, అమర్ నాధ్, రమణారెడ్డి, మహంకాళి వెంకయ్య, తోటకూర వెంకటరాజు(టి.వి. రాజు), అట్లూరి పుండరీకాక్షయ్య, ఛాయాదేవి, హేమలత, తదితరులు నటించారు.
ప్రఖ్యాత దర్శకుడు టి.వి.రాజు గారి సంగీత సారధ్యంలో
“ఆనందమే జీవితాట మధురానందమే జీవితాట”
“బస్తీకి పోయేటి ఓ పల్లెటూరివాడా పదిలంగా రావోయి”
“ఆలపించనా అనురాగముతో,ఆనందామృత మావరించగా”
“ఏలనోయీ యీ విషాదమూ, నీకేలనోయి”
వంటి పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి.
పిచ్చిపుల్లయ్య గా డీ-గ్లామర్ పాత్రలో ఎన్.టి. రామారావు గారి అద్భుతమైన నటన, మంచి సందేశంతో కూడిన ఈ చిత్రం విమర్శకుల నుండి ప్రశంసలు పొందినప్పటికి, ఆశించిన మేరకు విజయవంతం కాలేకపోయింది.
తనలోని నటున్ని ఆవిష్కరించడం కోసం తాను చేసే ప్రయోగాలకు నిర్మాతలను ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యం తో ఎన్టీఆర్ గారు స్వంతంగా “నేషనల్ ఆర్ట్స్” అనే నిర్మాణసంస్థను స్థాపించి తమ తొలి చిత్రం గా ఒక
ప్రయోగాత్మక చిత్రం గా “పిచ్చి పుల్లయ్య” సినిమా ను నిర్మించారు.
నటీమణి కృష్ణకుమారి కి తొలిసారిగా ఈ చిత్రం లో నటించే అవకాశం కల్పించడంతో పాటు తన రూమ్ మేట్ అయిన టి.వి. రాజు గారికి కూడా తొలిసారిగా సంగీత దర్శకునిగా ఈ చిత్రం ద్వారా అవకాశం కల్పించారు ఎన్టీఆర్ గారు.
ఈ చిత్రం మొదటి రిలీజ్ లో 17-07-1953 తేదీన ఆంధ్రలోని 15 కేంద్రాలలో విడుదలైనది.
ఆపిదప రెండు వారాలు ఆలస్యంగా 31-07-1953 తేదీన నైజాం, సీడెడ్ లోని 8 కేంద్రాలులో విడుదలైనది. ఈచిత్రం యావరేజ్ విజయాన్ని అందుకుని ఒక కేంద్రంలో 50 రోజులు పైగా ఆడింది.
విజయవాడ – జైహింద్ టాకీస్ లో 56రోజులు ప్రదర్శింపబడింది.

