మొదటి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో భారత్ కు గట్టి దెబ్బ కొట్టింది ఆసీస్. అడిలైడ్ వేదికగా జరుగుతున్న మొదటి పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ బౌలింగ్ ముందు భారత్ తోక ముడిచింది. 9/1 వద్ద ఈరోజు తమ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 15 పరుగుల వద్ద వరుసగా 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత మరో నాలుగు పరుగులు చేసి 19 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత మరో పది పరుగులు చేసిన తర్వాత వృద్ధిమాన్ సాహా, అశ్విన్ వెంటవెంటనే వెనుదిరిగారు. దాంతో 31 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. అయితే చివర్లో రిటైర్డ్ ఔట్ గా పెవిలియన్ చేరుకున్నాడు షమీ. ఆ కారణంగా 36 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన భారత ఇన్నింగ్స్ ముగిసిపోయింది. అయితే 1974 లో ఇంగ్లండ్ తో జరిగిన ఓ టెస్ట్ మ్యాచ్ లో 42 పరుగులకే ఆలౌట్ అయిన భారత్ ఇప్పుడు 36 పరుగులకే ఇన్నింగ్స్ ముగించుకొని చెత్త రికార్డు మూటగట్టుకుంది. అయితే ఈ భారత ఇన్నింగ్స్ లో మయాంక్(9) పరుగులే అత్యధికం. అంటే ఒక్క బ్యాట్సమెన్ కూడా రెండంకెల స్కోర్ సాధించలేదు. దాంతో ఈ మొదటి టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించాలంటే ఆసీస్ 90 పరుగులు చేస్తే చాలు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post
next post
మీవల్లే కళ్యాణ్ గారిని కలిశాను… నా జీవితంలో మీరు చాలా స్పెషల్…