telugu navyamedia
తెలంగాణ వార్తలు

టీఆర్‌ఎస్ ప్లీనరీలో భోజ‌నం మెనూ..

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో టీఆర్‌ఎస్ ప్లీనరీకి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. టీఆర్ఎస్ పార్టీ పెట్టి 20వ సంవత్సరం సందర్భంగా జరుగుతున్న ఈ వేడుకలకు హైదరాబాద్ న‌గ‌రం అంతా పుల్ గులాబీ మ‌యంగా మారింది. ఈ  ప్లీనరీనికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ప్రతినిధులతో పాటు మొత్తం 10 వేల మంది వరకు తరలివచ్చారు. మూడేళ్ల పాటు ప్లీనరీ సమావేశాలు జరగలేదు. దీంతో ఈ సారి గులాబీ శ్రేణులు భారీ ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు.

అయితే వ‌చ్చిన వారికి ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా… ముఖ్యంగా భోజ‌నాలు …తెలంగాణ సాంస్కృతి ఉట్టి ప‌డేలా అతిథులకు 34 రకాల వంటలు ప్రత్యేక మెనూ సిద్ధం చేశారు. తెలంగాణ రుచులతో పాటు.. రాయలసీమ రాగి సంకటి తో పాటు ఇరానీ ఛాయ్‌ని మెనూలో పెట్టారు.

k chandrasekhar rao: Stage set for Telangana Rashtra Samithi plenary today,  K Chandrasekhar Rao to be elected chief | Hyderabad News - Times of India

మాంసాహారులు కోసం..
మాంసాహార ప్రియుల కోసం తొమ్మిది రకాల వంటలు.. నాన్‌ వెజ్ ఐటమ్స్‌లో.. ధమ్ చికెన్ బిర్యాని, మటన్ కర్రీ, నాటు కోడి పులుసు, ఎగ్ మసాలా, నల్లా పొడి ప్రై, మటన్ దాల్చా, బోటీ ఫ్రై, పాయా సూప్, తలకాయ పులుసు స్పెషల్‌గా చేయించారు.

శాఖాహారుల కోసం..
స్పెషల్ రోటీ పచ్చళ్ళు, మూడు రకాల స్పెషల్‌ స్వీట్లు, గత్తి వంకాయ కూర, బెండకాయ ఫ్రై.. ఇక స్పెషల్ ఐటెంగా రాగి సంకటితో పాటు రుమాల్ రోటీ, ఆలూ క్యాప్సికం, బగారా రైస్, వెజ్ బిర్యాని, వైట్ రైస్, చామగడ్డ పులుసు, మామిడికాయ పప్పు, పచ్చిపులుసు, ముద్దపప్పు, సాంబారు, ఉలవచారు వంటలు శాఖాహారుల కోసం, రెడీ అయ్యాయి.

ఇక రోటీ పచ్చళ్లుగా వంకాయ చట్నీ, బీరకాయ టమోటా చట్నీ, వెల్లుల్లి జీడిగుల్ల ఆవకాయ ఉండనే ఉన్నాయి. పెరుగు, పెరుగు చట్నీ, వడియాలు చేయిస్తున్నారు. స్వీట్స్‌లో భాగంగా జిలేబీ, డబుల్‌కా మీటాను ప్రత్యేకంగా తయారు చేశారు.

Related posts