కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లో లాక్డౌన్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో నిత్యవసర వస్తువుల దుకాణాలు మినహా మరే దుకాణాలు తెరవడం లేదు. బార్లు, రెస్టారెంట్లు, వైన్ షాపులు అన్నీ బంద్ చేశారు. మందుబాబులు ఆల్కహాల్ దొరక్క పిచ్చెక్కి పోతున్నారు. దీంతో ఓ మందుబాబు ఏకంగా ఓ బార్ అండ్ రెస్టారెంట్‌కే కన్నం వేశాడు. ఈ ఘటన అమెరికాలోని కనెక్టికట్‌లో చోటుచేసుకుంది. లాక్డౌన్ నేపథ్యంలో అక్కడి బార్, రెస్టారెంట్లు మూసే ఉంటున్నాయి. లూయిస్ ఏంజిల్ ఓర్టిజ్ అనే 42 ఏళ్ల వ్యక్తి ఓ రెస్టారెంట్లోకి చొరబడ్డాడు. లాక్డౌన్ పూర్తయ్యే వరకు ఆ రెస్టారెంట్‌ను తెరవరని భావించే.. అందులోనే ఉండిపోయాడు. నాలుగు రోజులపాటు ఆ రెస్టారెంటులో నిల్వ ఉన్న ఆహారాన్ని కడుపు నిండా తిన్నాడు. బార్లో ఉండే మద్యం తాగుతూ హాయిగా ఎంజాయ్ చేశాడు. రెస్టారెంట్‌ను చూసుకొనేందుకు దాని యజమాని అక్కడికి వచ్చాడు. తలుపులు తెరిచి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుర్తుతెలియని వ్యక్తి రెస్టారెంటులో ఉన్నాడని త్వరగా రావాలని చెప్పాడు. దీంతో పోలీసులు ఓర్జిజ్ను అదుపులోకి తీసుకున్నారు.
previous post

