telugu navyamedia
ఆరోగ్యం

వేసవి తాపానికి పుచ్చకాయే పర్ఫెక్ట్ అంటున్న నిపుణులు

water-melon

వేసవి కాలంలో ముఖ్యంగా రోహిణీకార్తె సమయంలో మన శరీరంలో వాటర్ లెవెల్స్ మాటిమాటికీ తగ్గిపోతూ ఉంటాయి. డీహైడ్రేషన్ స్టేజ్‌కి వెళ్లిపోతూ ఉంటాం. ఇలాంటప్పుడు వడ దెబ్బ తగిలి ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదంవస్తూ ఉంటుంది. అందుకే బాడీలో వాటర్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ తగ్గిపోకుండా ఉండేందుకు పుచ్చకాయ ముక్కలు తినడం బెస్ట్ ఆప్షన్ అంటున్నారు డాక్టర్లు. పుచ్చకాయలో ఉండే విటమిన్లు, పోషకాలు, వ్యాధి నిరోధక శక్తిని పెంచే యాంటి ఆక్సిడెంట్లు, బీ విటమిన్, కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, క్లోరిన్, జిటాకేరోటిన్లు, ఆల్కలైన్, విటమిన్ ఏ, విటమిన్ బి6, విటమిన్ సి, సుక్రోజ్ , ఫ్రక్టోజ్, గ్లూకోజ్, ఎలక్ట్రో లైట్లు ఎండాకాలంలో మన శరీరానికి కావాల్సిన పోషకాల్ని అందిస్తాయని డాక్టర్లు సూచిస్తున్నారు. పుచ్చకాయలు రక్తపోటు, గుండె పోటు తగ్గిస్తాయి. కాన్సర్ వ్యాధిని తగ్గించే లక్షణాలు కూడా పుచ్చకాయలో ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలు పుచ్చకాయ ముక్కలు తింటే, పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు, తేనెతో కలిపి పుచ్చకాయ ముక్కలు తింటే మంచిదట కిడ్నీలో రాళ్లు ఉన్నవారు, మలబద్ధకంతో బాధపడేవారికి పుచ్చకాయ ఎంతో మంచిది. కామెర్లు పైత్యం, వికారం, తలనొప్పి, నోరు తాడారిపోవడం వంటి సమస్యలకు పుచ్చకాయ సరైన ఆప్షన్. విరేచనాలు, కడుపునొప్పి, ఉబ్బరం, ఎసిడిటికి చెక్ పెట్టాలంటే పుచ్చకాయ ముక్కలు తినాలి. గ్లూకోజ్, తేనె, నిమ్మరసంతో కలిపి తింటే మరింత ప్రయోజనం ఉంటుంది. మరి ఇక ఆలస్యం ఎందుకు ఇన్నిప్రయోజనాలున్న పుచ్చకాయని ఇంటిల్లిపాది తిని ఆరోగ్యంగా వుండండి.

Related posts