మాజీ మంత్రి రమేశ్ జార్కి హోళి తనపై లైంగిక దాడిచేశాడని న్యాయవాది ద్వారా ఫిర్యాదు చేసింది బాధిత యువతి. బాధితురాలి తరపు న్యాయవాది జగదీశ్ బెంగళూరులోని నగర పోలీసు కమిషనరేట్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. వీడియో కాల్ ద్వారా అశ్లీలంగా మాట్లాడుతూ ఇబ్బంది పెట్టాడని, ఉద్యోగం ఇప్పించకపోగా ప్రాణాలు తీస్తానని బెదిరించినట్లు ఆ యువతి ఫిర్యాదులో పేర్కొన్నట్లు న్యాయవాది తెలిపారు. తానే స్వయంగా ఫిర్యాదు రాసినట్లు ఓ వీడియోను విడుదల చేసింది బాధితురాలు. తనకు ప్రాణభయం ఉన్నా… ప్రజల నుంచి వస్తున్న మద్దతుతో త్వరలోనే ధైర్యం ముందుకు వస్తానని చెప్పింది. ఇక, బాధితురాలి ఫిర్యాదు మేరకు రమేశ్ జార్కిహోళిపై ఐపీసీ 376సీ, 354ఏ, 504, 506, 417 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు కబ్బన్ పార్కు పోలీసులు. త్వరలోనే రమేశ్ జార్కిహోళిని అరెస్టుచేస్తామని ప్రకటించారు. కానీ, ఈ కేసులో ఎదురుదాడి మొదలుపెట్టాడు రమేశ్ జార్కిహోళి. పది ఫిర్యాదులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానంటూ తెలిపాడు.చూడాలి మరి ఈ కేసులో ఎప్పటికి తీర్పు వెలువడుతుంది అనేది.
previous post
next post