telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

వకీల్ సాబ్ ట్రైలర్ వచ్చేస్తుంది…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే హిందీలో విజయవంతమైన ‘పింక్‌’ చిత్రానికి రీమేక్‌ ఇది. అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను ప్రేక్షకులు తెరపై చూసి మూడు సంవత్సరాలు దాటింది. దింతో ఆయన అభిమానులు ‘వకీల్ సాబ్’ కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్వరాలు సమూరుస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. రేపు సాయంత్రం 6.00 గంటలకు ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసారు. అయితే ఈ సినిమాను ఏప్రిల్ 9న ఈ సినిమాను రిలీజ్ కాబోతుంది. చూడాలి మరి ఈ సినిమా పై పవన్ అభిమానులు పెట్టుకున్న అంచనాలను అందుకుంటుందా… లేదా అనేది.

Related posts