నేను శంకుస్థాపన చేసిన భవనాన్ని.. పదేళ్ల తరువాత మళ్లీ నేనే ప్రారంభోత్సవం జరపడం చాలా సంతోషంగా ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు.
విజయవాడలో జిల్లా కోర్టు నూతన భవన సముదాయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ… సీఎం జగన్ తెలుగులో మాట్లాడడం అనంగా ఉందని అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిగారు తెలుగులో మాట్లాడాక.. తాను తెలుగులో మాట్లాడకపోవడం బాగోదని అన్నారు. ఆలస్యం జరిగినప్పటికీ.. భవన నిర్మాణాలు పూర్తికావడం చాలా సంతోషించదగ్గ విషయం. ప్రజలందరికీ సత్వర న్యాయం చేకూర్చే బాధ్యత న్యాయవాదులపై ఉంది’’ అని అన్నారు.
న్యాయ వ్యవస్థకు అదనపు నిధుల విషయంలో కేంద్రం నుంచి వ్యతిరేక వచ్చినప్పుడు మద్దతు ఇచ్చిన ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు. పెండింగ్ కేసులు విషయంలో సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలనే తపన న్యాయమూర్తులకు, న్యాయవాదులకు ఉండాలని జస్టిస్ ఎన్వీ రమణ ఆకాంక్షించారు.
విభజన అనంతరం ఏపీ ఆర్థికంగా వెనకబడిందన్న సీజేఐ.. విభజనతో నష్టపోయామన్న భావన ఏపీ ప్రజల్లో ఉందని, కాబట్టి ఈ విషయంలో కేంద్రం రాష్ట్రానికి తోడ్పాటు అందించాలని కోరారు.
కొన్ని రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని.. భవనాల నిర్మాణాలకు కేంద్రం నిధులు ఇస్తే సహకరించినట్లవుతుందని చెప్పారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. న్యాయవ్యవస్థపై ప్రజలు విశ్వాసం కోల్పోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం అని అన్నారు. న్యాయవ్యవస్థను పటిష్ట పరిచే కార్యక్రమాల్లో ప్రభుత్వాల భాగస్వామ్యం తప్పనిసరని సీజేఐ అన్నారు.
తనను చాలా మంది గొప్ప మనసుతో ఆదరించి పైకి తీసుకొచ్చారని సీజేఐ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. సమాజంలో మార్పు కోసం న్యాయవాదుల కృషి చేయాలని పిలుపునిచ్చారు. తన ఉన్నతికి, విజయానికి కారమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు.
నేను రెండు తెలుగు రాష్ట్రాల్లో జడ్జి ల ఖాళీలను భర్తీ చేసాను. 250 మంది హైకోర్టు జడ్జి లను, 11 మంది సుప్రీంకోర్టు జడ్జి లను నియమించగలిగాను. సీఎం వై ఎస్ జగన్ సహకారం వల్లనే ఇప్పుడు ఈ భవనం పూర్తి చేసుకోగలిగామని అన్నారు. విశాఖపట్నం లో కూడా ఓ భవనం చివరి దశలో ఉంది. దానితో పాటు ఇతర కోర్టు భవనాలను కూడా పూర్తి చేయాలని సీఎం జగన్ను కోరుతున్నాం అని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.
తనను ఓడించేందుకు వంద కోట్లు: పవన్