telugu navyamedia
క్రైమ్ వార్తలు

దోషపూరిత ఖైదు పరిహారం రూ.10,45,69,500… చేయని తప్పుకు 46 ఏళ్ళ శిక్ష…!?

Wrongfully Imprisoned person get huge compensation

అమెరికాకు చెందిన ఓ వృద్ధుడి కథ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను గుర్తుకు తెస్తోంది. 73 ఏళ్ల రిచర్డ్ ఫిలిప్స్ అనే అమెరికాకు చెందిన ఈ వ్యక్తి గ్రెగరీ హర్రిష్ అనే వ్యక్తి మర్డర్ కేసులో మొదట జైలుకు వెళ్లడం, 46 ఏళ్ల తరువాత అసలు నిందితుడు లొంగిపోవడం, దాంతో రిచర్డ్ నిర్దోషిగా విడుదల కావడం జరిగింది. అయితే రిచర్డ్ ఫిలిప్స్ నిర్దోషి అని తెలియడంతో మిచిగాన్ దోషపూరిత ఖైదు పరిహారం చట్ట ప్రకారం అతడికి జైలులో గడిపిన ఒక్కొ ఏడాదికి గాను 50 వేల డాలర్ల చొప్పున్న 46 ఏళ్లకు 1.5 మిలియన్ డాలర్లు(రూ.10,45,69,500) అందనున్నాయి. ఈ మేరకు మిచిగాన్ అటార్నీ జనరల్ దానా నెస్సెల్ ప్రకటించారు. ఈ పరిహారంపై ఎలాంటి పన్నులు లేకుండా చట్ట ప్రకారం నయాపైసా కూడా పొకుండా ఫిలిప్స్‌ చేతికి మొత్తం నగదు అందుతుందని అతడి తరఫు న్యాయవాది గబి సిల్వర్ పేర్కొంది. 

రిచర్డ్‌కు 27 ఏళ్లు ఉన్నప్పుడు 1972, అక్టోబర్‌లో యావజ్జీవకారాగార శిక్ష పడింది. అప్పటి నుంచి గత నాలుగున్నర దశాబ్దాలుగా కటకటాల్లోనే గడిపాడు. అయితే, 2010లో ఈ హత్యకేసులో అసలు నిందితుడు రిచర్డ్ పొలొంబొ అని తేలింది. దాంతో 2017లో తిరిగి ఫిలిప్స్‌పై కోర్టులో విచారణ మొదలైంది. ఏడాది తరువాత 2018 మార్చిలో ఫిలిప్స్‌ జైలు నుంచి విడుదలయ్యాడు. ఇలా చేయని తప్పుకు 46 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన రిచర్డ్ ఫిలిప్స్‌కు భారీ పరిహారం అందనుంది. ప్రస్తుతం ఓ అపార్ట్‌మెంట్‌లో కిరాయికి ఉంటున్న ఫిలిప్స్ పరిహారం చేతికి అందగానే ఓ చిన్న ఇల్లు కొనుక్కొని తన శేష జీవితాన్ని సుఖ సంతోషాలతో ఆనందంగా గడపాలని అతడి తరఫు న్యాయవాది గబి సిల్వర్ కోరుకుంది.

Related posts