telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

మా ముందు ముద్దు పెట్టుకోండి… స్వలింగ సంపర్కులపై దాడి

Woman-and-Girlfriend

మెలానియా గేమోగాట్ అనే 28 ఏళ్ళ యువతి తన గర్ల్‌ఫ్రెండ్ క్రిస్‌తో కలిసి బార్లు, పబ్‌లు ఎక్కువగా ఉండే కేంపెన్ టౌన్‌ ప్రాంతానికి డేటింగ్‌కు వెళ్లి అర్థరాత్రి బస్సులో తిరుగు ప్రయాణమైంది. రాత్రి 2.30 గంటల సమయంలో బస్సులో వారిద్దరు మాత్రమే ఉన్న సమయంలో నలుగురు దుండగులు బస్సులోకి ప్రవేశించి వారి గురించి ఆరాతీశారు. వారిద్దరు స్వలింగ సంపర్కులని తెలుసుకున్న దుండగులు.. వారిద్దరిని తమ ముందు ముద్దు పెట్టుకోమని, అది చూసి ఆనందిస్తామని బలవంతపెట్టారు. సమస్యను పరిష్కరించడానికి మెలానియా జోక్స్ వేయడం మొదలుపెట్టడంతో దుండగులు వారిద్దరిపై దాడి చేశారు. రక్తం వచ్చేలా వారిద్దరిని అమానుషంగా కొట్టారు. కొంత సమయానికి బస్సు ఆగిన చోటే పోలీసులు ఉండటంతో వారు యువతులను దుండగుల నుంచి రక్షించారు. జరిగిన దాడి గురించి మెలానియా వివరిస్తూ, దెబ్బలు తిన్న ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా.. ఈ వార్త ఒక్కసారిగా వైరల్ అయ్యింది.

Related posts