telugu navyamedia
క్రీడలు వార్తలు

ఒక్కే మ్యాచ్ లో రెండు రికార్డులు క్రియేట్ చేసిన కోహ్లీ…

భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో వన్ డౌన్ లో బ్యాటింగ్‌ దిగి.. 10 వేలకు పైగా పరుగులు చేసిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. పూణే వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో విరాట్ ఈ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. పాంటింగ్ మూడో నంబర్‌ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగి 12662 పరుగులు చేశాడు. అయితే పుణె వేదికగా జరిగినరెండో వన్డేలో విరాట్ కోహ్లీ (66) హాఫ్ సెంచరీ చేసి ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో మూడో స్థానంలో బ్యాటింగ్‌ వచ్చి 10046 పరుగులు పూర్తిచేసుకున్నాడు. ఇక ఇదే మ్యాచ్ లో మరో రికార్డు కూడా నెలకొల్పాడు కోహ్లీ. 50 ఓవర్ల క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఐదో కెప్టెన్‌గా కూడా విరాట్ నిలిచాడు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్ ‌(5416) ను కోహ్లీ అధిగమించాడు. కెప్టెన్‌గా కోహ్లీ తన 94వ వన్డే మ్యాచ్ ఆడుతున్నాడు. స్మిత్ 150 మ్యాచ్‌ల్లో 5416 రన్స్ చేశాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. 234 వన్డేల్లో 8497 పరుగులు చేశాడు. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 200 వన్డేల్లో 6641 పరుగులతో రెండవ స్థానంలో ఉన్నాడు.

Related posts