telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సీనియర్ నటుడు ఖాదర్ ఖాన్ కన్నుమూత

Khader-Khan

బాలీవుడ్ సీనియర్ నటుడు ఖాదర్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిన్న సాయంత్రం హాస్పిటల్ లో మృతి చెందారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. ప్రస్తుతం ఆయన తన కుమారుడు సర్ఫరాజ్, కోడలు షాహిస్తలతో కలిసి కెనడాలో ఉంటున్నారు”మా నాన్నగారు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. డిసంబర్ 31న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఆయన మరణించారు. సోమవారం మధ్యాహ్నం ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. గత 16 ,17 వారాలుగా ఆయన హాస్పిటల్ లోనే ఉన్నారు. అంత్యక్రియలు కెనడాలోనే జరపనున్నాం” అంటూ వెల్లడించారు సర్ఫరాజ్.

కాబుల్ లో జన్మించిన ఆయన 1973లో ‘దాగ్’ అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. దాదాపు మూడు వందల సినిమాల్లో ఆయన నటించారు. దాదాపు 250 సినిమాలకు రైటర్ గా పని చేశారు. ఇక ఖాదర్ ఖాన్ ముఝ్సే షాదీ కరోగీ, లక్కీ, ఆంఖియోంసే గోలీ మారే, జోరూ కా గులామ్, ఫన్ తూష్, జీనా సిర్ఫ్ మేరే లియే, బనారసీ బాబు, జుడాయి, జుడ్వా తదితర చిత్రాల్లో నటించారు.

Related posts