telugu navyamedia
health

పొట్టలోకి టూత్ బ్రష్… విజయవంతంగా బయటకు తీసిన వైద్యులు 

Tooth-Brush
ఎవరైనా ఉదయాన్నే లేచి టూత్ బ్రష్ తో పళ్లను శుభ్రం చేసుకుంటారు. అయితే ఈ టూత్ బ్రష్ ఏకంగా ఓ మహిళ కడుపులోకి వెళ్ళిపోయింది. ఈ ఘటన మేఘాలయాలోని షిల్లాంగ్ లో జరిగింది. ఆ ప్రాంతానికి చెందిన ఓ 50 ఏళ్ల మహిళ టూత్ బ్రష్ తో పళ్లను ఎలా రుద్దుకుందో తెలియదు కానీ… అది విరిగిపోయి గొంతులోకి చేరుకుంది. వెంటనే ఆమె దాన్ని తీయడానికి ప్రయత్నించగా బయటకు రాకపోగా మరింతగా పొట్టలోకి చేరిపోయింది. దీంతో అప్పటినుంచి సదరు మహిళకు పొట్ట నొప్పి మొదలైంది. ఈ క్రమంలోనే కూతురి బలవంత పెట్టగా ఆ మహిళ ఆసుపత్రికి చేరుకొని, వైద్యుడికి విషయాన్ని వివరించింది. డాక్టర్ ముందుగా ఎక్స్ రే తీసి చూడగా… వచ్చిన రిపోర్ట్ లో బ్రష్ ముక్క ఎక్కడుందో సరిగ్గా కన్పించలేదు. దీంతో స్కానింగ్ చేసి చూశారు. అప్పుడు బ్రష్ ముక్క స్పష్టంగా కన్పించింది. ముందుగా ఈ బ్రష్ ముక్కను ఆపరేషన్ చేసి బయటకు తీయాలని భావించారు వైద్యులు. కానీ ఎండోస్కోపీ ద్వారా తీయడం మంచిదని భావించి, దాదాపుగా గంటసేపు ప్రయత్నించి బ్రష్ ముక్కను విజయవంతంగా బయటకు తీశారు వైద్యులు. ఆ తరువాత వైద్యులు ఆ మహిళను డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. 

Related posts

వాముతో వెయ్యి.. ఉపయోగాలు…కొన్నైనా…

vimala p

పొట్లకాయంత… ఆరోగ్యం కోసం…

vimala p

అతి నిద్రకు .. ఇదే పరిష్కారం..

vimala p