telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు సామాజిక

రాశిఫలాలు : ..ఆవేశాలకు పోయి .. సమస్యలు తెచ్చుకోరాదు..

Today Rasi Phalalu

మేషం
ఈ రోజు మీ జీవిత భాగస్వామితో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ పిల్లలు మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తారు. మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం కానీ, ఆలయ సందర్శన కానీ చేస్తారు. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో అనుకూల ఫలితాలుంటాయి.

వృషభం
ఈ రోజు చాలా కాలం నుంచి వాయిదా పడుతున్న పనులు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. వాటిని విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. అలాగే ఉద్యోగంలో మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది. ప్రయాణాలకు సాధారణ దినం.

మిథునం
ఈ రోజు డబ్బు విషయంలో కొంత సామాన్యంగా ఉంటుంది. అవసరానికి తగిన డబ్బు లభించక పోవడం కానీ, పెట్టుబడుల కారణంగా నష్టపోవడం కానీ జరుగవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనువైన దినం కాదు.

కర్కాటకం
ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.

సింహం
ఈ రోజు ఆర్థికంగా చాలా అనుకూలించే దినం. రావాల్సినబకాయిలు రావడమే కాకుండా మీరు తీర్చాల్సిన బాకీలు కూడా తీర్చగలుగుతారు. అనుకోని డబ్బు కానీ, చేపట్టిన పనిలో విజయం కానీ వరిస్తుంది. ఉద్యోగ విషయంలో శుభవార్త వింటారు.

కన్య
ఈ రోజు చేపట్టిన పనులు వాయిదా పడడం కానీ, అనుకోని అడ్డంకులు రావడం కానీ జరగవచ్చు. ఇది కేవలం తాత్కాలికమే , పట్టువదలక ప్రయత్నించండి. విజయం మీ సొంతమవుతుంది. పని ఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్యానికి, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంటుంది. తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది.

తుల
ఈ రోజు దూర ప్రదేశం నుంచి ఒక శుభవార్త వింటారు. మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణం చేసే అవకాశముంటుంది. బంధువులను కలుసుకుంటారు.

వృశ్చికం
ఈ రోజు ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. నేత్ర సంబంధమైన సమస్యలు కానీ, ఎలర్జీ బారిన కానీ పడే అవకాశముంటుంది. అలాగే మానసికంగా ఏదో తెలియని ఒత్తిడిని ఫీల్ అవుతారు. ఆర్థిక విషయాల్లో కూడా కొంత జాగ్రత్త అవసరం. డబ్బు ఎక్కువ దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయకండి.

ధనుస్సు
ఈ రోజు మీకు ఆనందంగా, లాభ దాయకంగా ఉంటుంది. అనుకోని మిత్రులను కలవడం, వారితో రోజును ఆనందంగా గడపటం చేస్తారు. అలాగే మీ కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. ఆర్థికంగా లాభిస్తుంది. పెట్టుబడుల నుంచి అనుకోని లాభం వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.

మకరం
ఈ రోజు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. మీ కోరిక నెరవేరడం, లక్ష్యానికి చేరువవడం జరుగుతుంది. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగవిషయంలో విదేశీయానానికి సంబంధించి శుభవార్త వింటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

కుంభం
ఈ రోజు ప్రయాణం చేసే అవకాశం అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉదర, ఛాతి సంబంధ అనారోగ్యాల వల్ల ఇబ్బంది పడే అవకాశముంటుంది. నిద్రలేమి కారణంగా రోజంతా ఏదో తెలియని అసౌకర్యంగా ఉంటుంది. మిత్రులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం చేసే అవకాశముంటుంది.

మీనం
ఈ రోజు మీ సహోద్యోగులతో, పై అధికారులతో కొంత సామరస్య పూర్వకంగా ప్రవర్తించడం మంచిది. అనుకోని ఆవేశం కారణంగా వారితో గొడవ జరిగే అవకాశముంటుంది. ప్రయాణంలో అనవసరమై చిక్కుల్లో ఇరుక్కునే అవకాశముంటుంది గనుక జాగ్రత్త అవసరం. పెట్టుబడులకు, భూ, గృహ సంబంధ ఒప్పందాలకు అనువైన రోజు కాదు.

Related posts