telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

బ్రిటన్ రాజకీయాలు : ప్రధాని థెరీసా .. రాజీనామాకు సిద్ధం..

therisa may desided to resign to britan pm

రాజీనామా కు బ్రిటన్ ప్రధాన మంత్రి థెరీసా మే సిద్ధపడ్డారు. బ్రెగ్జిట్‌పై ఆమె వైఖరిని ఘాటైన విమర్శలు వస్తుండటంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఆమె 10, డౌనింగ్ స్ట్రీట్ నివాసం వెలుపల మాట్లాడుతూ తాను ప్రధాన మంత్రి పదవికి వచ్చే నెల 7న రాజీనామా చేస్తానని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన ముగిసిన తర్వాత రాజీనామా చేస్తానన్నారు. బ్రెగ్జిట్ డీల్‌ను మూడుసార్లు తిరస్కరించారని, దీనికి మద్దతివ్వాలని ఎంపీలకు నచ్చజెప్పడానికి చాలా కృషి చేశానని, అయినప్పటికీ ఫలితం లేకపోయిందని థెరీసా మే చెప్పారు.

థెరీసా గత వారం, వచ్చే నెల 3న పటిష్టమైన బ్రెగ్జిట్ డీల్‌ను ప్రవేశపెడతానని హామీ ఇచ్చారు. దీనిపై తన ఇతర పార్టీలతోపాటు సొంత పార్టీ కూడా తీవ్ర విమర్శలు గుప్పించడంతో ఆమె తన పదవికి రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నారు. 2016 జూలైలో థెరీసా ప్రధాన మంత్రి పదవిని చేపట్టారు. వచ్చే నెల 7న ఆమె రాజీనామా తర్వాత ప్రధాన మంత్రి పదవి కోసం జరిగే రేసులో బోరిస్ జాన్సన్ ముందు వరుసలో ఉంటారని తెలుస్తోంది. బోరిస్ గతంలో విదేశాంగ శాఖ కార్యదర్శిగా చేశారు. హోం సెక్రటరీ సాజిద్ జావిద్, విదేశాంగ శాఖ కార్యదర్శి జెరెమీ హంట్ తదితరులు పోటీలో ఉంటారని సమాచారం.

Related posts