telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సైనా పాత్రలో పరిణితి… నెర్వస్ గా ఉందంటున్న బ్యూటీ

Saina

బాలీవుడ్‌ బ్యూటీ పరిణీతి చోప్రా ‌ ప్రధాన పాత్రలో బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. టి సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్యాడ్మింటన్ స్టార్ గా కనిపించడానికి పరిణీతి చోప్రా శిక్షణ తీసుకుంటుంది. ఈ సినిమా పరిణితి కెరియర్లో బెస్ట్ మూవీ అవుతుందని చిత్రయూనిట్ చెప్తుంది. రోచక్ కోహ్లీ- అమాల్ మాలిక్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా అమాల్ మాలిక్ పరీణీతి సైనా ప్రీలుక్ స్క్రీన్ షాట్ ని షేర్ చేసాడు. ఈ సినిమాకు సంబంధించిన మ్యాజిక్ చేస్తున్నామని ఈ మ్యూజిక్ హైలైట్ గా వుండబోతోందని.. మనోజ్ ముంతాషిర్ అద్భుతమైన లిరిక్స్ ఇస్తే శ్రేయాస్ ఘోషల్ అంతే అద్భుతంగా పాడిందని చెప్పుకొచ్చాడు. అలాగే పరిణీతి చోప్రా పెర్ఫార్మెన్స్ కి వంద మార్కులు పడతాయని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ని రిట్వీట్ చేసిన పరిణీతి చాలా నెర్వస్ గా వుందని రిప్లే ఇచ్చింది.

Related posts