telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

55 అంతస్థులపైన స్విమ్మింగ్ పూల్… కానీ మెట్లే…!

360-Degree-Swimming-Pool

ప్రపంచంలోనే వినూత్నమైన స్విమ్మింగ్‌పూల్‌ను లండన్‌లో నిర్మిస్తున్నారు. లండన్ సిటీ మధ్యలో ఉన్న ఓ 55 అంతస్థులపై నిర్మించబోయే ఈ స్విమ్మింగ్‌పూల్ నమూనా చిత్రం విడుదలవగా.. నెటిజన్లు ఈ స్విమ్మింగ్‌పూల్‌పై రకరకాలుగా జోక్‌లు వేస్తున్నారు. ఇన్‌ఫినిటీ లండన్ అనే పేరుతో నిర్మిస్తున్న ఈ స్విమ్మింగ్ ఫూల్‌ను 360 డిగ్రీస్‌లో నిర్మిస్తున్నారు. అంటే మొత్తం నాలుగు వైపులా పూల్ తప్ప.. మరేమీ ఉండదన్నమాట. మొత్తం పూల్ మాత్రమే ఉంటే మరి పూల్‌లోకి ఎలా వెళ్లాలి అనే సందేహం నెటిజన్లకు వచ్చింది. అంతే, ఇంకా నిర్మించకముందే ఈ పూల్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. దీన్ని నిర్మిస్తున్నవారిని ఇదే ప్రశ్న అడిగితే.. వారు ఏం చెప్పారంటే.. జలాంతర్గామిని ఆదర్శంగా తీసుకుని దీన్ని నిర్మిస్తున్నామని, ఈ స్విమ్మింగ్‌పూల్‌‌ లోపలే మెట్లు ఉంటాయని చెప్పారు. నిజమండీ.. జలాంతర్గామి తలుపు లాంటి తలుపును నిర్మించారట.. అందులో నుంచి రౌండు మెట్లను(స్పైరల్ స్టెయిర్‌కేస్) తయారుచేశారు. ఎవరైనా స్విమ్మింగ్ పూల్‌లోకి వెళ్లాలంటే.. ఆ రౌండ్ మెట్ల ద్వారా కింది నుంచి పైకి రావాలి. మళ్లీ బిల్డింగ్‌లోకి వెళ్లిపోవాలన్నా అదే మెట్ల ద్వారా కింది నుంచి బిల్డింగ్‌లోకి వెళ్లాలి. కాగా, ఈ వినూత్నంగా ఉండేలా ఈ స్విమ్మింగ్ పూల్‌ నిర్మాణంలో గ్లాస్ బదులుగా కాస్ట్ ఆక్రిలిక్‌ను వాడుతున్నారు. పూల్ ఫ్లోర్ ట్రాన్స్‌పరెంట్ కావడంతో బిల్డింగ్‌లోని ఒకటో ఫ్లోర్ నుంచి కూడా 55వ ఫ్లోర్‌‌లో స్విమ్మింగ్ చేస్తున్నవారిని చూడచ్చు. 2020లో ఈ స్విమ్మింగ్‌పూల్ నిర్మాణం పూర్తికానుంది.

Related posts