telugu navyamedia
సినిమా వార్తలు

విలక్షణ కవి కళాప్రపూర్ణ కొండవీటి వేంకటకవి

The Great Poet Kondaveti Venkata Kavi 102 Jayanthi
ఆధునిక కవుల్లో ఓ ప్రత్యేకత కలిగి , విలక్షణమైన రచనలతో ప్రస్థానం సాగించిన కవి పండితుడు వేంకటకవి . మహాకవి , పండితుడు , తాత్వికుడు , హేతువాది కొండవీటి వేంకటకవి గారి 102వ జయంతి నేడు . వెంకట కవి గారు సంస్కృత , ఆంధ్ర భాషల్లో  పండితులు . అనేక శతకాలు ,  గ్రంధాలు రచించి ప్రఖ్యాతిగాంచారు. 
The Great Poet Kondaveti Venkata Kavi 102 Jayanthi
వెంకటకవిగారి రచనల్లో కర్షకా! (1932), హితబోధ (1942) , భాగవతులవారి వంశావళి (1943), ఉదయలక్ష్మీ నృసింహతారావళి (1945)చెన్నకేశవా! (1946), భావనారాయణ చరిత్ర (గద్యకావ్యము) (1953), దివ్యస్మృతులు (1954)నెహ్రూ చరిత్ర – ప్రథమ భాగము (1956) , నెహ్రూ చరిత్ర – ద్వితీయ భాగము (1962)త్రిశతి (1960), బలి (1963) తో పాటు ఆనాటి దినపత్రికల్లో అనేక వ్యాసాలూ రచించారు . ఆంధ్రదేశంలో కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి గారు తెలుగు సాహిత్యంలో ఓ పెను తుఫాను గా చెప్పుకోవచ్చు .
The Great Poet Kondaveti Venkata Kavi 102 Jayanthi
పురాణేతిహాసాల్లో వున్న తప్పులను చూపుతూ హేతుబద్దంగా ఆయన సాగించిన రచనలు పెనుదుమారాన్నే కలిగించాయి . అప్పటివరకు వివాహాల్లో జరిగే మంత్రాల మర్మాన్ని వివరిస్తూ ఎందరికో స్ఫూర్తి కలిగించారు . అంతేకాదు వివాహాల్లో మాత్రలు లేకుండా ఒక హేతువాదిగా వివాహాలు జరిపించడం మొదలు పెట్టారు . అప్పట్లో రామస్వామి చౌదరి గారి స్పూర్తితో ఎందరో యువకులు వారి మార్గాన్ని అనుసరించారు . అందులో కొండవీటి వెంకటకవిగారు ఒకరు . రామస్వామి చౌదరి గారిలా వేంకటకవి గారు ఆదర్శ వివాహాలు జరిపించడం మొదలు పెట్టారు .
అప్పటి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి ఆవుల సాంబశివ రావు గారి కుమార్తె మంజులత వివాహాన్ని హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో వేలాది మంది సమక్షలో జరిపించారు . ఇది ఎందరికో మార్గదర్శకంగా నిలిచిందని చెప్పవచ్చు . సాహిత్యం అంటే కవిగారికి ఎంతో మక్కువ . అయినా అందరిలా కాకుండా కొండవీటి కవి హేతువాది దృష్టితో చూసేవాడు . ఆ మార్గాన్నే జీవితమంతా అనుసరించారు .
మహానటుడు ఎన్ .టి . రామారావుగారు 1977లో కవిగారిని సినిమా రంగానికి ఆహ్వానించారు . వారి ఆహ్వానంతో “దాన వీర శూర కర్ణ “1980లో “శ్రీమద్విరాటపర్వం “, “శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ” చిత్రాల్లో కొండవీటి వెంకటికవి గారు విలక్షణమైన సంభాషణలు వ్రాసారు .  వేంకటకవి గారంటే ఎన్ .టి . రామారావు గారికి ఎంతో అభిమానం , గౌరవం . రామారావు గారి సినిమాల్లో “దాన వీర శూర కర్ణ “. “శ్రీమద్విరాటపర్వం “, “శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ” ఎంతో విలక్షణంగా ఉంటాయి . వేంకటకవి గారి మాటలు పాత్రోచితంగా ఉంటాయి . 
The Great Poet Kondaveti Venkata Kavi 102 Jayanthi
కొండవీటి వెంకట కవి రచనల్లో ఓ ప్రత్యేకత ఉంటుంది . ఆయన భావాలు ఎంత సూటిగా వుంటాయో , ఆయన రచనలు కూడా విలక్షణంగా , విభిన్నంగా ఉంటాయి .  కొండవీటి వేంకటకవి గారు 25 జనవరి 1918లో  గుంటూరు జిల్లా విప్పర్ల గ్రామంలో నారాయణ , శేషమ్మ దంపతులకు జన్మించారు . తెలుగు ,సంస్కృత  భాషలు నేర్చుకున్నారు . తెలుగు పండితుడుగా పనిచేశారు . కొంతకాలం దేశమంతా పర్యటించి జీవితం పట్ల అవగాహన ఏర్పరచుకున్నారు .  ఆ తరువాత సాహిత్యం పట్ల మక్కువ పెంచుకొని  తన 14 వ ఏట “కర్షకా ” అనే రచనతో సాహిత్య ప్రస్థానం మొదలు పెట్టారు . 
The Great Poet Kondaveti Venkata Kavi 102 Jayanthi
ఆయన జీవితాల్లో ఎన్నో సత్కారాలు , సన్మానాలు జరిగాయి. ఆంధ్ర విశ్వకళా పరిషత్తు  వేంకటకవి గారికి “కళాప్రపూర్ణ ” బిరుదుతో ఘన సన్మానం చేసింది .  1953లో వేంకటకవి గారి ప్రతిభను గుర్తించి కవిరాజు బిరుదు నిచ్చారు . తెలుగు సాహిత్యంలో , సినిమా రంగంలో తనదైన ముద్రవేసుకున్న గొప్ప కవి వేంకటకవి గారు . వారు 7 ఏప్రిల్ 1991లో వేంకటకవి  గారు ఇహలోక యాత్ర ముగించారు . 
వేంకటకవి గారు దర్శకులు దాసరి నారాయణ రావు గారి దగ్గరకు తరచు వచ్చేవారు . దాసరి నారాయణ్ రావు గారే నాకు వెంకట కవి గారిని పరిచయం  చేశారు .
The Great Poet Kondaveti Venkata Kavi 102 Jayanthi
వేంకటకవి గారు సాహిత్యం గురుంచి గంటలు తరబడి మాట్లాడేవారు . దాసరి గారు కవిగారంటే ఎంతో అభిమానంగా ఉండేవారు . ముఖ్యంగా పురాణాల గురించి దాసరి గారు కవిగారి చెబుతుంటే ఎంతో ఆసక్తిగా వినేవారు . వారిద్దరి సమావేశాల్లో  నేను అనేక పర్యాయాలు పాల్గొన్నాను .  వేంకటకవి గారు చూడటానికి ఎంతో సామాన్యంగా కనిపించేవారు . కానీ కవిగా అసమాన్యుడు , అన్యన్య ప్రతిభా సంపన్నుడు . 

-భగీరథ 

Related posts