telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలకృష్ణ వ్యాఖ్యలపై ఇప్పుడు స్పందించను : మంత్రి తలసాని

Thalasani

సినిమా పెద్దల మీటింగ్ పై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సినిమా షూటింగ్స్ కు అనుమతి కోరుతూ టాలీవుడ్ లో కొందరు ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఈ చర్చకు తనను ఎవ్వరు పిలవలేదని , అందరిలానే తాను మీడియాలో చూసి తెలుసుకున్నాను అని బాలకృష్ణ అన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలకు నిర్మాత సి.కళ్యాణ్ స్పందిస్తూ… “మా”కు ఎవరితో అవసరం ఉంటే వాళ్ళనే పిలుస్తామని అన్నారు. చిరంజీవికి ఫేస్ వాల్యూ ఉంది కాబట్టే ఆయనను పిలిచామని కళ్యాణ్ అనడంతో ఈ వివాదం ముదిరింది. ఇక బాలకృష్ణ అభిమానులు ఈ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఇక ఇదే విషయం పై సినిమాటోగ్రఫీ మంత్రి తలసానిని మీడియా ప్రశ్నించగా… బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించారు. “బాలకృష్ణ వ్యాఖ్యలపై ఇప్పుడు స్పందించను… ఎందుకన్నాడో కనుక్కొని అప్పుడు మాట్లాడుతా…” అని తలసాని అన్నారు. నియమనిబంధనలతో సినిమా షూటింగ్స్ కు అనుమతి ఇస్తున్నామని, జాగ్రత్త చర్యలు బాధ్యత సినీ పెద్దలదే అని తలసాని పేర్కొన్నారు. సాయంత్రం జీవో విడుదల అవుతుందని తలసాని తెలిపారు.

Related posts