telugu navyamedia
సినిమా వార్తలు

మ్యూజిక్ అవార్డ్స్‌లో ఒంటరైన నిక్… ప్రియాంక ఏం చేసిందంటే ?

Priyanka-Chopra

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గతేడాది హాలీవుడ్ అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ అమెరికాలో కాపురం పెట్టారు. నిక్ కంటే ప్రియాంక పదేళ్లు పెద్దది కావడంతో సోషల్ మీడియాలో ఇప్పటికీ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎదిగి గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు సంపాదించుకుంది ప్రియాంకా చోప్రా. ఇప్పుడు వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ దాంప‌త్య జీవితాన్ని గ‌డుపుతున్నారు. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ప్రియాంక చోప్రా త‌న భ‌ర్త‌తో క‌లిసి దిగిన ఫోటోల‌ని సామాజిక మాధ్య‌మాల‌లో ఎక్కువ‌గా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ప్రియాంక చోప్రా త‌న క్రియేటివిటీని ఉప‌యోగించి త‌యారు చేసిన ఓ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 11 ఏళ్ళ త‌ర్వాత నిక్ జోనాస్ త‌న బ్ర‌ద‌ర్స్ జో, కెవిన్‌తో క‌లిసి ఎంటీవీ వీడియో మ్యూజిక్ అవార్డ్స్‌లో స్పెష‌ల్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చారు. నిక్ సోద‌రులు అయిన జో త‌న భార్య సోఫీతో.. కెవిన్ త‌న భార్య డానియెల్ తో క‌లిసి ఈ వేడుక‌కి హాజ‌రు కాగా… వారి ప‌ర్‌ఫార్మెన్స్‌కి అవార్డ్ ద‌క్కింది. నిక్ సొద‌రులు ఇద్ద‌రు త‌మ భార్య‌ల‌కి కిస్సెస్ ఇచ్చి సంతోషాన్ని వ్య‌క్త‌ప‌ర‌చారు. అయితే నిక్ మాత్రం ఒక్క‌డే అలా నిలుచొని చూస్తూ ఉన్నాడు. ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో ప్రియాంక కంట ప‌డ్డాయి. దీంతో ప్రియాంక త‌న‌ని నిక్ హ‌త్తుకున్న‌ట్టు ఫోటో షాప్ చేసి త‌న పేజ్‌లో షేర్ చేసింది. “నేనెప్పుడు నీతోనే ఉంటాను నిక్ జోనాస్” అని ఫోటోకి క్యాప్ష‌న్ ఇచ్చింది. ప్రియాంక చేసిన ఈ పనికి నెటిజ‌న్స్ ఆమెపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

 

View this post on Instagram

 

I’m always with you @nickjonas 😜😍Congratulations @jonasbrothers! I’m so proud of all of you! #sucker

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

Related posts