telugu navyamedia
culture news trending

అగ్రరాజ్యంలో ఈ అమ్మాయే హాట్ టాపిక్.. ఎందుకంటే…!?

Texas

టెక్సాస్‌కు చెందిన ఓ అమ్మాయి  హై స్కూల్‌ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె డిప్లొమా పట్టా అందుకుంది. పట్టా చేతికి అందగానే వెంటనే అక్కడి నుంచి బయటకు పరుగులు పెట్టింది. దీంతో అక్కడ ఉన్నవారికి ఆ అమ్మాయి ఎందుకు బయటకు పరుగు తీసిందో అర్థం కాలేదు. ఇక పట్టా అందుకున్న ఆ విద్యార్థిని నేరుగా ఓ బ్రిడ్జీ వద్దకు వెళ్లి ఆగింది. అక్కడ తన కోసం ఎదురుచూస్తున్న ఓ వ్యక్తి వద్దకు వెళ్లి అతణ్ణి ఆప్యాయంగా కౌగిలించుకొని కన్నీరు పెట్టుకుంది. ఆ వ్యక్తి ఎవరు? ఈ అమ్మాయి అతణ్ణి ఎందుకు ఆలింగనం చేసుకొని కన్నీరు పెట్టుకుంది? అనేది కొద్దిసేపు స్థానికులకు అర్థం కాలేదు.

ఇంతకు ఆ బ్రిడ్జీ దగ్గర అమ్మాయి కోసం ఎదురుచూస్తున్న వ్యక్తి ఎవరో కాదు ఆమె కన్నతండ్రి. మెక్సికో, యూఏస్‌ దేశాలను వేరు చేసేదే ఆ బ్రిడ్జీ. దశాబ్దం క్రితం తండ్రికి దేశ బహిష్కరణ శిక్ష పడడంతో మెక్సికో వెళ్లిపోయిందా కుటుంబం. అప్పటి నుంచి తండ్రి అగ్రరాజ్యంలో అడుగుపెట్టలేదు. కూతురు సరాయి రూయిజ్ ప్రతిరోజు మెక్సికన్ బార్డర్‌ను క్రాస్‌చేసి టెక్సాస్‌లోని లారెడొలో గల తన స్కూల్‌కు వెళ్లి వస్తుంది. ప్రస్తుతం ఈ కుంటుంబం మెక్సికోలోని న్యూవో లారెడోలో నివాసముంటుంది. ఇక తండ్రి ఎలాగు సరిహద్దు దాటి తన స్కూల్‌కు రాలేడని భావించిన రూయిజ్.. గత దశాబ్దకాలంగా తన కోసం తండ్రి పడుతున్న వేదనను బయటి ప్రపంచానికి తెలిజేయాలని నిర్ణయించుకుంది. దీనికి గ్రాడ్యుయేషన్ డేను వేదికగా మార్చుకుంది. తండ్రిని కలుసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో తీయమని తన స్నేహితురాలికి రూయిజ్ ముందే చెప్పింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది కాస్తా వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Related posts

వీవీప్యాట్ లో పాము..బెదిరిపోయిన ఓటర్లు

vimala p

టెక్ మహేంద్ర ఫౌండేషన్ .. ఉచిత శిక్షణ…

vimala p

ఎలుకల రవాణా కు.. హెలికాఫ్టర్లు…

vimala p