telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సైరా కి తప్పని లీకులు… పవన్ వాయిస్ ఓవర్ …

syeraa movie leak pavan voice over

సినీ రంగంలో లీకుల బాగోతం మాత్రం తప్పటంలేదు. అది చిన్న చిత్రమా, పెద్ద చిత్రమా అనేది లేకుండా ప్రతి దానిని లీక్ చేస్తున్నారు. అయితే అది ప్రచారంలో భాగంగా కొన్నిసార్లు జరుగుతుంటే, మరికొన్నిసార్లు మరో రకంగా జరుగుతుంది. ఏదిఏమైనా చిరంజీవి నటిస్తున్న సైరా కి కూడా ఈ లీకుల బాధ తప్పలేదు. అయితే ఇది ప్రచారం కోసమా, లేదా మరొకందుకా అనేది తెలియాలి. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ముఖ్య సన్నీవేశాలు, డైలాగ్స్, లొకేషన్లు, పిక్చర్స్ సోషల్ మీడియాలో లీక్ కావడంతో దర్శక, నిర్మాతలు తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఓ సినిమాకు హీరో ఇలా ఉంటాడు అన్న విషయం రిలీజ్ అయ్యే వరకు తెలియకపోతే ప్రేక్షకులు ఎంతో థ్రిల్ గా భావిస్తారు. ఈ మద్య లీకేజ్ గొలతో తమ హీరో ఇలా ఉండబోతున్నారా అని రక రకాల ఊహాగానాలతో నిరుత్సాహంలో మునిగిపోతున్నారు చిరంజీవి అభిమానులు.

ఖైదీ నెంబర్ 150 సినిమాతో సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి కమర్షియల్ సక్సెస్ తో పాటు మెసేజ్ ఓరియెంటెడ్ గా కూడా సూపర్ హిట్ అయ్యింది. సినీ కెరీర్ ప్రారంభించిన తర్వాత చిరంజీవి చిరకాల వాంఛ..ఒకటి మిగిలిపోయిందట. అదే మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింమారెడ్డి జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తీయాలని..అందులో నటించాలని, ఆ కోరిక తన తనయుడి ద్వారా తీర్చుకోబోతున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు మెగాస్టార్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా దాదాపు పూర్తి కావొచ్చింది. అన్నీ కంప్లీట్ చేసుకొని అక్టోబర్ 2 రిలీజ్ చేయబోతున్నారట. ఈ మూవీ టీజర్ కి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీలో పవన్ కళ్యాన్ తనవాయిస్ ఓవర్ ఇస్తున్నారట. పవన్ వాయిస్ ఓవర్ ఇచ్చిన ఓ డైలాగ్ లీక్ అయింది… ‘అందరు గుర్తించిన వీరులు ఎందరో ఉన్నారు.. కానీ ఎవరూ గుర్తించని వీరుడొక్కడు ఉన్నారు.. ఆయనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి,’ అయితే ఇది ఎంత వరకు నిజమో అనేది తెలియాల్సి ఉంది.

Related posts