telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

అబుదాబిలో ఉన్న సెలూన్స్, బ్యూటీపార్లలపై నిఘా… రంజాన్ స్పెషల్…!!

Abu-Dhabi

అబుదాబిలో ఉన్న సెలూన్స్, బ్యూటీపార్లలపై అక్కడి పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. పవిత్ర రంజాన్ మాసంలో సెలూన్స్, బ్యూటీపార్లల నిర్వహకులు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా నగర వ్యాప్తంగా సుమారు 40 మంది పోలీసు అధికారులతో తనిఖీలు నిర్వహిస్తోంది అక్కడి ప్రభుత్వం. తనిఖీల్లో దొరికిన నేరస్థుల పట్ల కఠిన చర్యలు తీసుకొనున్నట్లు అధికారులు తెలిపారు. కస్టమర్లకు హాని కలిగించే గడువు ముగిసిన కాస్మెటిక్స్, హానికరమైన రసాయనాలు వాడరాదని అధికారులు హెచ్చరించారు. తప్పనిసరిగా ఆరోగ్య మరియు భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. అలాగే బ్లాక్ హెన్నా, డైలను కస్టమర్లకు వాడకూడదు. వీటితో పాటు హెర్బల్ ఉత్పత్తులపై సరియైన లెబలింగ్ లేకపోవడం, సౌందర్య సాధనాల శుభ్రత పాటించకపోయిన సెలూన్, బ్యూటీపార్లల నిర్వహకులపై కేసు నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒకవేళ ఉల్లంఘనలకు పాల్పడితే మాత్రం సుమారు 5వేల దినార్లు జరిమానాగా విధిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రంజాన్ మాసంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ స్పెషల్ ప్రొగ్రామ్ కండక్ట్ చేస్తున్నట్లు అబుదాబి పోలీసులు వెల్లడించారు.

Related posts