telugu navyamedia
telugu cinema news trending

ట్రోల్స్, మీమ్స్ చేసే వారికి శ్రీముఖి సమాధానం ఇదే…!

Srimukhi

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో విన్నర్ గా నిలుస్తుందని అందరూ భావించిన బుల్లితెర రాములమ్మ శ్రీముఖి రన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ షో జరుగుతున్న సమయంలో శ్రీముఖి మీద పెద్ద ఎత్తున ట్రోల్స్ జరిగాయి. హౌస్‌లో ఆమె వ్యవహారశైలి మీద, అంతకు ముందు ఆమె హోస్ట్ చేసిన టీవీ షోల మీద భయంకరంగా ట్రోల్స్, మీమ్స్ వేశారు. అయితే బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న 105 రోజులు వాటి గురించి తెలుసుకోవడానికి ఆమెకు అవకాశం లభించలేదు. అయితే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత వాటన్నిటి గురించి శ్రీముఖి ఫుల్ డిటెయిల్స్ తెలుసుకుంది. తన మీద జోక్స్ వేసిన వారి గురించి, తన మీద వేసిన మీమ్స్, ట్రోల్స్ గురించి కూడా తెలుసుకుంది. వాటిపై స్పందించిన శ్రీముఖి సమాధానం ఇస్తూ “మీమ్స్ వల్ల చాలా విషయాలు తెలుస్తాయి. ఓహో ప్రపంచంలో ఇవన్నీ జరుగుతున్నాయా అని కూడా తెలుస్తుంది. సమాజానికి ఎన్నో విషయాలు తెలియజేస్తూ మీరు చాలా బాధ్యతాయుతమైన పొజిషన్‌లో ఉన్నారు. నన్ను చాలా మంది సపోర్ట్ చేశారు. నా మీద కొందరు నిందలు కూడా వేశారు. అయినా నేను వాళ్ల జోలికి వెళ్లను. అయితే, ట్రోల్స్, మీమ్స్ చేసిన వారందరికీ ఒక్కటే చెబుతున్నా. గుడ్‌లక్” అని చెప్పింది. అంతేకాదు తాను బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్ చెప్పింది. ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్న శ్రీముఖి త్వరలో హైదరాబాద్ రాబోతోంది. వచ్చాక వీలైనంత మందిని కలుస్తానని చెప్పింది.

Related posts

క్రేజీ మల్టీస్టారర్ లో మెగాస్టార్ ?

vimala p

ప్రియాంకను తొలగించాలంటూ పాక్ డిమాండ్… దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన ఐరాస

vimala p

భలే పండుగ ఆఫర్ .. కిలో బంగారం బహుమతి… రిలయన్స్‌ డిజిటల్‌…

vimala p