telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

2019 ప్రపంచ కప్ : .. ఓటమి గెలుపుకు మెట్టు.. దక్షిణాఫ్రికా..

south africa captain on team play in 2019 world cup

దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్‌ వరుస మ్యాచ్‌ల్లో ఓటమి ఎదురైనా తమ జట్టులో ఆత్మవిశ్వాసం తగ్గలేదని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్‌, భారత్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ సఫారీ జట్టు ఓటమి చవిచూడగా.. సోమవారం వెస్టిండీస్‌తో మ్యాచ్‌ వర్షం కారణంగా తుడిచిపెట్టుకపోయింది. దీనితో ఇరు జట్లకు చెరో పాయింట్ రావడంతో మొత్తానికి దక్షిణాఫ్రికా పాయింట్లపట్టికలో ఖాతా తెరిచినట్లయింది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే సఫారీలకు సెమీస్‌ అవకాశాలు దాదాపు సంక్లిష్టమే. మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధిస్తే తప్ప ఆ జట్టు సెమీస్‌కు చేరుకోలేదు. అయితే సారథి డుప్లెసిస్‌ మాత్రం దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు.

ఇక నుంచి రానున్న ప్రతి మ్యాచ్‌లోనూ మేము మెరుగైన క్రికెట్‌ ఆడాల్సిందే. అందులోనూ పూర్తిస్థాయి నిలకడతో ముందుకు సాగాలి. ఒకవేళ ఈ రెండు విషయాల్లో మేము మెరుగుపడితే.. ఫలితం కూడా దానంతట అదే సానుకూలంగా వస్తుంది. దీంతో జట్టులోనూ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.’ అని డుప్లెసిస్‌ చెప్పుకొచ్చాడు. సాధారణంగా ఏదైనా జట్టు వరుసగా రెండు, మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోతే ఆటగాళ్లలో ఖచ్చితంగా నిరాశ కనిపిస్తుంది. దీని ప్రభావం జట్టుపైనా ఎక్కువగానే ఉంటుంది.

సఫారీల విషయానికొస్తే మాత్రం ఇలాంటి వాటికి మేము దూరం. జట్టుగా మేము చాలా బలంగా ఉన్నాం. ఆటగాళ్లు ప్రతి మ్యాచ్‌ను ఆస్వాదిస్తూ ముందుకు సాగుతున్నారు. క్రికెట్‌లో ఓటములు సహజం. అయితే అవి జట్టు ప్రదర్శన బట్టి ఉంటాయి. ఇక నుంచి ప్రతి మ్యాచ్‌లోనూ నైపుణ్యంతో కూడిన క్రికెట్‌ ఆడుతూ ముందుకు సాగుతాము. దీనికితోడు జట్టులో ఎవరో ఒకరు వ్యక్తిగతంగా మెరుగైన ప్రదర్శన చేస్తే దాని ప్రభావం మిగతా ఆటగాళ్లపై పడి వారిలోనూ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.. అంటున్నాడు డుప్లెసిస్‌.

Related posts