telugu navyamedia
telugu cinema news trending

“రూలర్” టీజర్… ఇక వేటే…!

Ruler

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 105వ చిత్రానికి “రూల‌ర్” అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ధర్మ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలయ్య నటిస్తున్నట్టు ఈ పోస్టర్ చూస్తుంటే అర్థం అవుతోంది. డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. ఈ చిత్రంలో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తుండ‌గా ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్‌ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాలో బాల‌కృష్ణ రెండు షేడ్స్‌లో క‌న‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. సినిమాను డిసెంబ‌ర్ 20న విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ సినిమా టీజర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ధర్మ మా ఊరి గ్రామ దైవం అంటూ చెప్పే సంభాషణలతో షురూ అయ్యే టీజర్..యాక్షన్ సన్నివేశాలతో సాగుతుంది. “ఒంటి మీద ఖాకీ యూనిఫాం ఉంటేనే బోనులో పెట్టిన సింహంలా ఉంటాను. యూనిఫాం తీశానా… బయటకొచ్చిన సింహంలా ఆగను..ఇక వేటే” అంటూ బాలయ్య చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

Related posts

హీరోయిన్ గా హీరో సోదరి ఎంట్రీ

vimala p

పబ్‌జి … ప్రియులకు శుభవార్త.. లైట్..

vimala p

“సైరా” 12 రోజుల వసూళ్ళు… ఎక్కడ హిట్టు… ఎక్కడ ఫట్టు…?

vimala p