telugu navyamedia
ట్రెండింగ్ హాస్యం

లైవ్ లో రిపోర్ట్ ఇస్తుంటే… ఆమె తండ్రి చేసిన పని చుడండి

reporter

ప్ర‌స్తుతం ఉన్న క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో అన్ని కంపెనీలు వారి ఉద్యోగుల‌ను వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేయాల‌ని ఆదేశించాయి. ఈ క్ర‌మంలోనే కొంద‌రి ఫ‌న్నీ వీడియోస్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. తాజాగా టంపాలోని సన్‌కోస్ట్ న్యూస్ నెట్‌వర్క్ రిపోర్టర్‌గా పనిచేస్తున్న ఫ్లోరిడాకు చెందిన జెస్సికా లాంగ్ త‌న ఇంటి కిచెన్ నుంచి లైవ్ రిపోర్టింగ్ చేస్తోంది. ఈ క్ర‌మంలో ఆమె తండ్రి టి-ష‌ర్ట్ ధ‌రిస్తూ ఒక్కసారిగా కిచెన్ లోకి ప్ర‌వేశించాడు. దీంతో ఆమె ఒక్క‌సారిగా అస‌హ‌నానికి గురైంది. ఆ సమయంలో రిపోర్ట‌ర్ తల్లి డయానా వీడియో చిత్రీకరిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో ఇంట‌ర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది.

Related posts