telugu navyamedia
news telugu cinema news trending

కలెక్షన్ల రికార్డుల మోతలో.. అల.. వైకుంఠపురములో…

frist song from alavaikuntapuramlo movie

నటుడు అల్లు అర్జున్ ఏడాది మొదట్లోనే కిక్ స్టార్ట్ ఇచ్చేశాడు. 2020 సంవత్సరానికి ఘన స్వాగతం పలుకుతూ ‘అల.. వైకుంఠపురములో’ సినిమాతో ఆయన ఫ్యాన్స్‌ని ఖుషీ చేశారు. జనవరి 12న ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన బన్నీ.. తొలిరోజే సంక్రాంతి విన్నర్ అని రుజువు చేసుకున్నాడు. ఆ తర్వాత రెండో రోజు కూడా అదే స్పీడు కొనసాగించాడు. జనవరి 11న విడుదలైన మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ కూడా హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో.. ఆ మరుసటి రోజే వస్తున్న ‘అల.. వైకుంఠపురములో’ మూవీ కలెక్షన్స్ ఎలా ఉంటాయో అని కాస్త ఆందోళన చెందారు బన్నీ ఫ్యాన్స్. కానీ తన టాలెంట్ ఏంటో, సిన్సియర్‌గా పోటీలో దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో నిరూపించాడు అల్లు అర్జున్. ‘అల.. వైకుంఠపురములో’ మూవీకి బాక్స్ ఆఫీస్ వద్ద ట్రెమెండస్ రెస్పాన్స్ లభించడంతో తొలిరోజే వరల్డ్ వైడ్‌గా 85 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలుపుతూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు యూనిట్ సభ్యులు. దీంతో బన్నీ ఫ్యాన్స్ పండగ సంబరాలు మిన్నంటాయి.

కేవలం తెలుగు రాష్ట్రాల నుండి తొలి రోజే 25.56 కోట్ల షేర్ రాబట్టింది ‘అల.. వైకుంఠపురములో’ మూవీ. రెండో రోజు కూడా అదే స్పీడు కంటిన్యూ చేస్తూ మరో 10 కోట్ల సుమారు వసూళ్లు రాబట్టిందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇప్పటిదాకా అందిన రిపోర్ట్స్ ప్రకారం రెండో రోజు ముగిసే సరికి తెలుగు రాష్ట్రాల్లో ‘అల.. వైకుంఠపురములో’ మూవీ 33 నుంచి 35 కోట్ల షేర్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్పాయి. అదే వరల్డ్‌వైడ్‌గా చూస్తే 47 నుంచి 50 కోట్ల షేర్ వసూలైందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్‌లో దుమ్ముదులిపే కలెక్షన్స్ రాబడుతోంది ‘అల.. వైకుంఠపురములో’ మూవీ. సంక్రాతి విన్నర్‌గా నిలిచి అక్కడి మార్కెట్‌లో మరోసారి బన్నీ సత్తా చాటింది. అన్ని సెంటర్లలో దుమ్ము దుమారం చేస్తూ బాక్సాఫీస్ దాడి మొదలైందని ఇక కలెక్షన్ల ప్రవాహం ఈ నెలంతా ఉంటుందని అంటున్నారు జనం. గీత ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో ‘అల.. వైకుంఠపురములో’ మూవీ రూపొందింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. టబు, రాజేంద్రప్రసాద్, తనికెళ్ల భరణి సుశాంత్, నివేతా పేతురాజ్, సునీల్, బ్రహ్మాజీ, నవదీప్, సముద్రఖని ముఖ్యపాత్రలు పోషించారు.

Related posts

రైల్ పట్టాలపై మందు పార్టీ.. రైలు ఢీకొని నలుగురు మృతి

vimala p

“సైరా” సెట్లో అగ్నిప్రమాదం… 2 కోట్ల ఆస్తి నష్టం 

vimala p

సాహో : “ఏ చోట నువ్వున్నా…” సాంగ్‌ టీజ‌ర్

vimala p