telugu navyamedia
సినిమా వార్తలు

గుర్రం ఎక్కిన బాలయ్య..

టాలీవుడ్ హీరో, నంద‌మూరి న‌ట‌సింహం, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సంక్రాంతి సంబరాలు ఘనంగా చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో క‌లిసి కారంచేడులో సంక్రాంతి సంబరాల్లో మునిగిపోయారు.

తన సోదరి దగ్గుబాటి పురంధేశ్వరి నివాసంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించుకొనేందుకు కుటుంబంతో సహా ఏపీలోని ప్రకాశం జిల్లా కారంచేడు వచ్చిన ఆయన.. సరదగా గడిపారు. గుర్రమెక్కి కాసేపు సందడి చేశారు. అంతేగాక గుర్రంతో కలిసి ఆయన స్టెప్పులు వేయించారు. 

అనంతరం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ గుర్రం ఎక్కగా.. బాలకృష్ణ గుర్రం కళ్ళెం పట్టుకుని అదుపుచేశారు. 

Thumbnail image

ఈ వేడుక‌ల్లో బాలయ్య తన భార్య వసుంధర, కొడుకు మోక్షజ్ఞ, లోకేశ్వరి, ఉమామహేశ్వరి సహా ఇతర కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా బాలకృష్ణను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు, స్థానికులు తరలిరావడంతో అక్కడ అంతా పండగ వాతావరణం, కోలాహలం నెలకొంది. అయితే కోవిడ్ నేపథ్యంలో ఇంటిలోపలకు ఎవరిని అనుమతించలేదు.

Related posts