telugu navyamedia
సినిమా వార్తలు

హృతిక్ చూడు నిన్ను కంగనా ఏం చేస్తుందో… కంగనా సోదరి హెచ్చరిక

Rangoli

బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ కంగనా రనౌత్ ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ సోదరి రంగోలీ, హృతిక్ రోషన్ పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. హృతిక్ నటిస్తోన్న ‘సూపర్ 30’ సినిమా అలానే కంగనా నటిస్తోన్న ‘మెంటల్ హై క్యా’ సినిమా ఒకే రోజు విడుదల కాబోతున్నాయి. చాలా కాలంగా హృతిక్, కంగనాల మధ్య గొడవలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమా విడుదల వాయిదా వేద్దామని కంగనా, నిర్మాత ఏక్తా కపూర్ ని కోరారట. కానీ దానికి ఆమె అంగీకరించలేదు. దీంతో సోషల్ మీడియాలో హృతిక్ అభిమానులు కంగనాపై కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. దీనికి నిర్మాత ఏక్తా కపూర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. సినిమా ఎప్పుడు విడుదల చేయాలనేది నిర్మాతగా అది తన నిర్ణయమని, అందరితో మాట్లాడే నిర్ణయం తీసుకున్నామని, కాబట్టి ద్వేషంతో కూడిన వ్యాఖ్యలు చేయొద్దని పేర్కొంది.

ఈ ట్వీట్ ని ట్యాగ్ చేస్తూ రంగోలీ, హృతిక్ రోషన్ కు చురకలంటించింది. నేరుగా పోరాడే ధైర్యం లేక వెనుక నుండి నోటికొచ్చినట్లు మాట్లాడేవారి గురించి ఏం చెప్తాం.. నువ్వు, నీ పీఆర్వో కంగనాను ఎంతగా అవమానించాలని చూస్తే.. తను మిమ్మల్ని అంతగా తొక్కిపడేస్తుంది. హృతిక్‌.. చూస్తూ ఉండు. కంగన నిన్నేం చేస్తుందో.. ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నువ్వు ఎంతగా కంగనను టార్చర్‌ పెట్టాలని చూసినా తను నీకున్న కొవ్వంతా కరిగించేస్తుంది.ఇప్పటికైనా బాగుపడు” అంటూ వార్నింగ్ ఇచ్చింది.

Related posts