telugu navyamedia
సినిమా వార్తలు

మెగా పవర్ స్టార్ కు జపాన్ సర్ప్రైజ్

Ram-Charan

రామ్ చరణ్ వరుస విజయాలతో భారీ చిత్రాలతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. చెర్రీ న‌టించిన “మ‌గ‌ధీర” జ‌పాన్‌లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. తాజాగా మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌కు జ‌పాన్ అభిమానుల ఓ స‌ర్‌ప్రైజ్ అందింది. మార్చి 27వ తేదీన రామ్‌చ‌ర‌ణ్ 34వ జ‌న్మదినోత్స‌వం జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా చెర్రీకి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ జ‌పాన్ నుంచి కొంద‌రు అభిమానులు బ‌ర్త్‌డే గిఫ్ట్స్ పంపించారు. చెర్రీ న‌టించిన “మ‌గ‌ధీర” చిత్రంలోని పాత్ర‌లను గ్రీటింగ్ కార్డుల‌పై చిత్రించి పంపించారు. దాదాపు 50 మంది ఇలా చెర్రీపై ప్రేమ‌ను చాటుకున్నారు. ఆ గ్రీటింగ్ కార్డుల‌ను చెర్రీ త‌న ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసి వారికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశాడు. త్వ‌ర‌లోనే క‌లుస్తాన‌ని హామీ ఇచ్చాడు. “జ‌పాన్ నుంచి స్వీట్ స‌ర్‌ప్రైజ్ అందింది. నా ప‌ట్ల మీకున్న ప్రేమానురాగాలు న‌న్నెంతో సంతోష‌ప‌రిచాయి. త్వ‌ర‌లోనే మిమ్మ‌ల్ని కలుస్తాన‌ని ఆశిస్తున్నా. థాంక్యూ జ‌పాన్” అని చెర్రీ పోస్ట్ చేశారు.

Related posts