telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఆరోగ్య దినం : అసలు ఎందుకు..!

కంటి ముందు కరుగుతున్న..
జీవ నదుల సంగమం..!!
ఒంటినిండా పులుముకున్న..
బొగ్గుపులుసు వలయం..!!
విధి తప్పకుండా వాడబడు..
విష రసాల వాడకం..!
విధాత చూపిన..
జీవనాన్ని వెక్కిరించడం.
ఇంతేగా.. ఇంతేగా..
నవ సమాజ లక్ష్యం.
వింతేగా.. వింతేగా..
సుస్తి లేని జీవితం..!!
మదమెక్కి, ఓ పక్క..
ప్రకృతిని కబళించడం.
చేసిన చెడు మరచి..
తమ తమ చిన్నారుల భవితకై..
ప్రార్థించడం.
ఎందుకు ఈ నాటకం..
ఎవరిని ఏమార్చడం.
పనికిరాని అత్యుత్సాహం..
విలువ లేని అంతర్మధనం.
వత్సరానికి ఓ మారు..
నిన్ను తలచి ఏం లాభం.
మూగదైన నీ సంకల్పం..
ఏమిచ్చును సందేశం..!
W.H.O నిమ్మకుడడం..
మంచిదని నా ఉద్దేశ్యం.
ప్రపంచ ఆరోగ్య దినం..
ముగిసిన.. స్వప్న శకం.

Related posts