telugu navyamedia
సినిమా వార్తలు

పవర్ స్టార్ ఇంట శుభకార్యం… చిరు, చరణ్ లకు ఆహ్వానము

Puneeth-Raj-Kumara-and-CHiranjeevi

పవర్ స్టార్ మన పవన్ కళ్యాణ్ కాదు… కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్… కన్నడలో దిగ్గజ నటుడు రాజ్ కుమార్ కుటుంబానికి అక్కడ మంచి ఆదరణ ఉంది. రాజ్ కుమార్ తర్వాత ఆయన కుమారులు పునీత్ రాజ్ కుమార్, శివ రాజ్ కుమార్ స్టార్ హీరోలుగా కొనసాగుతూ సౌత్ నటులతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తున్నారు. తాజాగా పునీత్ రాజ్ కుమార్ కుటుంబం మెగాస్టార్ ఫ్యామిలీని కలుసుకుంది. పునీత్ సోదరుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ రెండో కొడుకు యువరాజ్ కుమార్ వివాహం త్వరలో జరగనుంది. ఈ నేపథ్యంలో పునీత్ తన సోదరుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ తో కలసి వచ్చి చిరంజీవిని వివాహానికి ఆహ్వానించారు. చిరంజీవి, రాంచరణ్ లకు శుభలేఖలు అందించారు. ఈ సంధర్భంగా చిరు, రాంచరణ్ లతో పునీత్ కలసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts