telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎన్టీఆర్ 30 : త్వరలోనే పెద్ద విశేషాన్ని తీసుకువస్తామంటున్న నిర్మాత

ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుస్తోన్న భారీ మల్టీస్టారర్ ‘రౌద్రం రుధిరం రణం’. “ఆర్ఆర్ఆర్” చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీంగా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించబోతున్నారు. ఈ సినిమా తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇది ఎన్టీఆర్‌కు 30వ సినిమా. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ లాక్ డౌన్ సమయంలో దీనికి సంబంధించిన పూర్తి స్క్రిప్టు పని పూర్తిచేశారు. అలాగే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా గురించి చిత్ర నిర్మాతల్లో ఒకరైన నాగ వంశీ తాజాగా ట్విట్టర్ ద్వారా స్పందించారు. “సినిమా గురించిన అప్ డేట్ చెప్పమంటూ యంగ్ టైగర్ తారక్ అన్న అభిమానుల నుంచి ఎన్నో మెసేజ్ లను అందుకుంటున్నాం. షూటింగును ఎప్పుడైతే మొదలెడతామో అప్పుడు ప్రతి ఒక్కటీ వెల్లడిస్తాం. అప్పటివరకు సినిమా టైటిల్ని ప్రకటించకూడదన్నది మా సెంటిమెంట్. మా మీద విశ్వాసం వుంచండి, త్వరలోనే మీ ముందుకు పెద్ద విశేషాన్ని తీసుకువస్తాం” అంటూ ఆయన పేర్కొన్నారు.

Related posts