telugu navyamedia
తెలుగు కవిత్వం సామాజిక

“ప్రేమ జీవన వేదం”

prema khaidi poetry corner
మనిషిగా జన్మిస్తే
సదా బుద్ధి ఉండే రీతిగా-
సంస్కారం జీర్ణించుకున్న 
విధంగా-
సత్యమార్గంలో నడుస్తున్న ట్లుగా-
ప్రేమ పరిధి అనంతం
ప్రేమ నిత్యం
ప్రేమ సత్యం
 ప్రేమే సంస్కారం
నేత్రాలతో వాస్తవాలు 
చూస్తున్నట్లే –
మనసుతో అనంతంగా 
యోచిస్తున్నట్లే –
ధైర్యంగా విజయం సాధిస్తున్నట్లే-
ప్రణయ వైశాల్యం అనంతం
“రాధాకృష్ణుల ప్రేమ” వోలె
నేత్రద్వయం లో ప్రేమ –
 మనసు యోచనల్లో ప్రేమ-
 ధైర్యం ఇచ్చే విజయంలో ప్రేమ-
నిండిఉంది!
ప్రేమే ప్రకృతికి ఆలంబనౌతోంది-
 ప్రేమే బంధాల్ని పటిష్టం చేస్తోంది-
ప్రేమే మనిషిని రాగరంజితం చేస్తోంది-
ప్రేమే నిత్యం శ్వాసను నిలుపు తోంది-
 “ప్రేమే జీవన వేదమై”
సతతం నడుపుతోంది!

Related posts