telugu navyamedia
సినిమా వార్తలు

సైనా నువ్వు ఈ ఆట ఎలా ఆడుతున్నావు ? : పరిణితి చోప్రా

Parineethi

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో ఓ బయోపిక్ రూపొందనున్న విషయం తెలిసిందే. టీ సిరీస్‌ బ్యానర్‌పై తెర‌కెక్కుతున్న ఈ బయోపిక్‌కు అమోల్‌ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సైనా పాత్రలో నటించనున్న పరిణీతి ఇప్పుడు బ్యాడ్మింట‌న్ నేర్చుకుంటోంది. అయితే ఈ శిక్ష‌ణలో ప‌రిణీతి చాలా కష్టపడుతోంది. తాజాగా బ్యాడ్మింటన్‌ ఆడుతున్న త‌న ఫొటోను, అలసిపోయి అక్కడే పడుకుని ఉన్న ఫొటోను పరిణీతి ట్విటర్‌లో షేర్ చేస్తూ “ప్రాక్టీస్‌కు ముందు, త‌ర్వాత‌.. సైనా నువ్వు ఈ ఆట ఎలా ఆడుతున్నావు?” అని కామెంట్ చేసింది. అక్టోబ‌ర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో సైనా పాత్రకు తొలుత శ్రద్ధా కపూర్‌ను తీసుకోగా… ఈ పాత్ర కోసం శ్ర‌ద్ధ చాలా క‌ష్ట‌ప‌డి సైనా దగ్గర బ్యాడ్మింటన్‌లో కోచింగ్ కూడా తీసుకుంది. సినిమాలో ఆమె ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు. అయితే ఉన్న‌ట్టుండి ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో శ్ర‌ద్ధ స్థానంలో ప‌రిణీతిని తీసుకున్నారు చిత్రబృందం.

Related posts