దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో “ఓ బేబీ” అనే సినిమాను తెరకెక్కించారు. “ఎంత సక్కగున్నావే” అనేది ట్యాగ్ లైన్. “మిస్ గ్రానీ” అనే కొరియన్ సినిమాను నందిని రెడ్డి రీమేక్ చేశారు. మిక్కి జె.మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సురేశ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లక్ష్మి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించారు. ఊర్వశి, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్, నాగశౌర్య ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ నెల 5న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. సినిమా అంచనాలను అందుకుంటూ ఘన విజయంగా నిలిచింది. ఎమోషనల్‌తో పాటు పలు కామెడీ సన్నివేశాలతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. ఈ సినిమాలో సమంత నటనకు సినీ అభిమానులే కాక సెలబ్రిటీలు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక నిన్న నిర్వహించిన ‘ఓ బేబీ’ థాంక్స్ మీట్‌లో పాల్గొన్న సమంత తెలుపు రంగు దుస్తుల్లో హంసలా మెరిసిపోయింది. ఈ సందర్భంగా ఫోటో షూట్‌లో పాల్గొన్న సామ్ తన శరీరంపై ఉన్న సీక్రెట్ టాటూని బయట పెట్టేసింది. తన భర్త అక్కినేని నాగచైతన్య పేరును సామ్ తన శరీరంపై కుడి వైపు పక్కటెముకల వద్ద టాటూగా వేయించుకుంది. ఫోటో షూట్‌లో భాగంగా సామ్ తన టాటూని బయట పెట్టింది. ఆ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సామ్, అద్భుతమైన జీవితాన్ని తాను అనుభవిస్తున్నానని పేర్కొంది. తాను ఇప్పటి వరకూ దాచి పెట్టిన ఒకే ఒక్క టాటూ చివరికి బయట పడిందని తెలిపింది. నా భర్త నాగ చైతన్యే నా ప్రపంచం అని సామ్ పేర్కొంది.
previous post