telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

పాగల్ టీజర్ విడుదల…

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం పాగల్. అయితే యంగ్ హీరో విశ్వక్ సేన్ తన రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’తో అందరి దష్టి ఆకర్షించారు. ఆ తరువాత ఫలక్‌నామా దాస్ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమాతో మాస్‌కా దాస్ అనే పేరును తెచ్చుకున్నారు. వెంటనే ‘హిట్’ అంటూ క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో అందరినీ ఆశ్చర్చపరిచారు. అయితే విశ్వక్ తనదైన నటనతో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం విశ్వక్ చేస్తున్న సినిమా పాగల్ తమిళ హిట్ సినిమా ‘ఓ మై కడవులే’ రీమేక్‌గా తెరకెక్కతుంది. ఈ సినిమాను నరేష్ కుప్పిల్లి దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తరున్ భాస్కర్ తెలుగు స్క్రీన్ ప్లే రాశారు. ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. అయితే ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విశ్వక్ తన రొమాంటిక్ యాంగిల్‌ను చూపించనున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి మాస్ కా దాస్ వారి అంచనాలను ఏమాత్రం అందుకుంటారో వేచి చూడాలి.

Related posts