కేంద్రప్రభుత్వం నుండి నిరుద్యోగ యువతకి శుభవార్త.. దక్షిణ మధ్య రైల్వే 12 వేల ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేసింది. ఒకేసారి 12,433 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెలాఖరులోపు విడుదల చేయనున్న ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ), రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్ఆర్‌సీ)లు ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి.
తాజాగా రైల్వేమంత్రి పియూష్ గోయల్ 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. అందులో భాగంగానే ఈ నెలలో దాదాపు లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఆర్‌ఆర్‌బీ, ఆర్‌ఆర్‌సీల ద్వారా భర్తీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.