telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వ్యాపార వార్తలు

గోదావరి : .. పశ్చిమాన .. మరిన్ని చమురు నిక్షేపాలు .. ఉత్పత్తికి సిద్ధం..

Oil reserves fonund in west godavari

ఓఎన్జీసీ దాదాపు రెండు సంవత్సరాలుగా కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో చమురు నిక్షేపాల కోసం చేస్తున్న అన్వేషణ ఫలించింది. పశ్చిమ గోదావరి తీరానికి దగ్గరలో నాలుగు చోట్ల అపారంగా గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని గుర్తించిన అధికారులు, ఇవన్నీ కొత్త బావులేనని, రెండు చోట్ల సర్వే డ్రిల్లింగ్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. మరో మూడు నెలల్లో గ్యాస్ ఉత్పత్తి ప్రారంభం అవుతుందని, రోజుకు సగటున రోజుకు 35 నుంచి 40 లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్యాస్, 1,400 టన్నుల ఆయిల్‌ వెలికితీత లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.

సుమారు 30 సంవత్సరాలుగా నరసాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో చమురును వెలికితీస్తున్న బావులు ఖాళీ కావడంతో, పాలకొల్లు, యలమంచిలి, భీమవరం తదితర ప్రాంతాల్లో రెండేళ్ల నుంచి గ్యాస్ అన్వేషణ కొనసాగుతోంది. తాజాగా, మొగల్తూరు మండలం ఆకెనవారితోట, భీమవరం సమీపంలోని మహాదేవపట్నం సహా నాలుగు చోట్ల చమురు నిక్షేపాలను అధికారులు గుర్తించారు.

Related posts