telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ డైరీలోని ఆ పేజీలు మిస్…!?

Sushanth

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్ప‌టికే ఈ కేసులోకి సీబీఐ ఎంటర్ అయ్యింది. మ‌రోవైపు ఈడీ కూడా పలువురికి సమన్లు జారీ చేసింది. సీబీఐ అధికారులు కేసు విషయంలో దూకుడు పెంచారు. అలాగే ఈ ఘటనలో ఏ1 నిందితురాలిగా రియా చక్రవర్తిని ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడం జరిగింది. ఇక రియా కుటుంబ సభ్యులతో పాటు మొత్తం ఏడుగురిని ఎఫ్ఐఆర్ లో చేర్చారు. అలాగే రియా చక్రవర్తి కొన్ని ఆర్ధిక నేరాలకు పాల్పడిందని ఈడీ భావిస్తుంది. రియా చక్రవర్తి కూడా నిన్న ఈడీ అధికారుల ఎదుట రియా హాజ‌రైంది. కాగా సుశాంత్ రాజ్ పుత్ డైరీలోని కొన్ని పేజీలు మిస్ కావడం అనేక అనుమానాలకు దారి తీస్తుంది. పలువురు ఆరోపిస్తున్నట్లు ఇందులో కుట్ర కోణం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రోజూవారి తన చర్యలను డైరీలో రాసుకొనే అలవాటున్న సుశాంత్ మిస్సైన పేజీలలో ఏం రాసి ఉంటాడనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో అసలు నిజాలు బయటికి వస్తాయని ఎవరో కావాలనే ఆ పేజీలను చించేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Related posts