పచ్చని పైరు పై వర్షపు చినుకులు మెరిసినట్టు …
తామర బొట్టు పై నీటి చుక్క నిలబడ్డట్టు…..
నా కళ్ళలో నువ్వు……
నా హ్రుదయం లో నీ ప్రేమ…..
నా పెదవుల పై నీ ముద్దుల తడి మెరిసిపోతున్నది..
సూర్యుని ఆగమనంలో నువ్వు…
చూసే చూపు రవి కిరణానికి పోటీగా ….
నను తాకుతున్నట్టు గా ఉన్నది .
నువ్వు చిరునవ్వు నవ్వుతుంటే…..
నిర్మల ఆకాశం లో వెలిగే నక్షత్రాలు ……
మెరిసినట్టు గా…..
నా మనసులో చీకటి రాగానే నీ జ్ఞాపకాలు ….
నాలో వెలుగును నింపుతాయి …..
నువ్వు రాగానే నా మనసులో….
సీతాకోక చిలుక లా కోరికలు ……
పూల వనం లో మన్మధ బాణం తో …..
నీ వైపు సంధించ బడతాయి….
అంతలోనే పెద్ద గాలి వానకు …..
నేల రాలిన పువ్వు ల్లా
ఆశలన్ని ఆవిరైపోతాయి…..
-జె పద్మావతి, ఆదోని
బోయపాటి శ్రీను మూర్ఖుడు, పశువుకంటే హీనం… రైటర్ సంచలన వ్యాఖ్యలు