telugu navyamedia
business news culture news

పతంజలి బ్రాండ్‌ నేమ్‌ వాడొద్దు.. బాబా రాందేవ్‌ నోటీసులు

Baba Ramdev patanjali sales down

పతంజలి బ్రాండ్‌ నేమ్‌ వాడొద్దని చెన్నైలోని ఓ సంస్థకు బాబా రాందేవ్‌ సోమవారం నోటీసులు పంపారు. పతంజలి పేరును ఉపయోగించరాదని చెన్నైలోని యోగా విద్యా, పరిశోధనా సంస్థకు నోటీసులు పంపారు. బాబా రాందేవ్ స్నేహితుడు బాలకృష్ణ ఆచార్య ‘పతంజలి’ పేరుతో ఆయుర్వేద కేంద్రాన్ని నడుపుతున్నారు. అంతేకాకుండా పతంజలి బ్రాండ్‌ నేమ్‌తో బిస్కెట్‌ తదితర వస్తువులను తయారుచేసి మార్కెటింగ్‌ చేస్తున్నారు.

చెన్నై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఆడియో సంస్థ ఒకటి పతంజలి యోగా సూత్రాలను విడుదల చేసింది. ఈ సంస్థ బాలాజీ విద్యాపీఠం అనే వర్సిటీ నడుపుతోంది. యోగా విద్యా, పరిశోధనా సంస్థకు బాబా రాందేవ్, బాలకృష్ణ ఆచార్య తరఫున నోటీసు పంపారు. పతంజలి పేరును తాము నమోదు చేశామని, దీన్ని ఉల్లంఘించడం 1999 పేటెంట్‌ చట్టం ప్రకారం నేరమని నోటీసులో పేర్కొన్నారు.

Related posts

అయినా ప్రభుత్వానికి కనువిప్పు కలగలేదు: .కె లక్ష్మణ్‌

vimala p

ఓడిపోవటం .. మా చేతకానితనమే … : జనసేనాని

vimala p

బీహార్‌లో రోడ్డెక్కిన కాంట్రాక్టు టీచర్లు.. టియర్‌ గ్యాస్‌ ప్రయోగం

vimala p