telugu navyamedia
సినిమా వార్తలు

“అర్జున్ రెడ్డి” అంటే సిగ్గుపడాలి : విజయ్ దేవరకొండ

Vijay-Devarakonda

ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి రూపొందించిన “అర్జున్‌రెడ్డి” సినిమాతో దేశ‌వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఆ సినిమాలో విజ‌య్ న‌ట‌న‌కు సామాన్యులే కాకుండా సినీ ప్ర‌ముఖులు సైతం ఫిదా అయిపోయి ప్ర‌శంస‌లు కురిపించారు. ఆ సినిమాలో మాస్ లుక్‌తో ఆక‌ట్టుకున్న విజ‌య్.. ఆ త‌ర్వాత వ‌చ్చిన “గీత‌గోవిందం”లో క్లాస్ న‌ట‌న‌తో ప్రేక్షకుల్ని మెప్పించాడు. ప్ర‌స్తుతం “డియ‌ర కామ్రెడ్‌” సినిమాలో న‌టిస్తున్న విజ‌య్ త‌న కెరీర్ గురించి ఓ ఆంగ్ల ప‌త్రిక‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ తన నటనను ఉద్దేశించి “ఇంకొన్ని సంవ‌త్స‌రాల త‌ర్వాత కూడా “అర్జున్ రెడ్డి” నా ఉత్త‌మ చిత్రం అని చెప్పుకుంటే నేను న‌టుడిగా ఎద‌గ‌లేన‌ట్టే. కొన్ని రోజుల త‌ర్వాత `అర్జున్ రెడ్డి`లో నా నాట‌న చూసి నేను సిగ్గుప‌డాలి. “అర్జున్‌రెడ్డి” అంటే సిగ్గుప‌డే స్థాయికి చేరుకోవాలి. ప్ర‌తీ సినిమాకు న‌టుడిగా ఎద‌గాలన్న‌దే నా ల‌క్ష్యం” అని విజ‌య్ చెప్పాడు.చెప్పుకొచ్చాడు.

Related posts