telugu navyamedia
వ్యాపార వార్తలు

నేషనల్ హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ కౌన్సిల్ తెలంగాణ శాఖ అధ్యక్షులు “రామిశెట్టి రామమూర్తినాయుడు”కి గౌరవ డాక్టరేట్

నేషనల్ హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ కౌన్సిల్-తెలంగాణ అధ్యక్షులు ‘రామిశెట్టి రామమూర్తి నాయుడు’ను “డాక్టరేట్” వరించింది. తమిళనాడులోని “గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ” ఈ అవార్డును ‘రామిశెట్టి’కి ప్రదానం చేసింది. కోవిడ్ నిబంధనల మేరకు చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమానికి ‘గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ’ ఛాన్సలర్ డాక్టర్ పి.మాన్యుల్ అధ్యక్షత వహించగా.. విశ్రాంత న్యాయమూర్తులు డా.ఎ.కె.ఎన్. వైద్యనాథన్, డా.సి.ఆర్.భాస్కరన్, విశ్రాంత ఐ.ఎ.ఎస్ అధికారి కె.సంపత్ కుమార్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

గత 30 ఏళ్లుగా హైదరాబాద్ స్థిరాస్తి రంగంలో నమ్మకానికి మారుపేరుగా నిలుస్తూ… వందలాదిమందిని కోటీశ్వరుల్ని చేసి… వేలాదిమంది సొంత ఇంటి కలను నిజం చేసిన రామిశెట్టి రామమూర్తినాయుడు “ఎస్.ఆర్.ఆర్.డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తూ… “నేషనల్ హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ కౌన్సిల్”- తెలంగాణ శాఖ అధ్యక్షులుగా నిరూపమాన సేవలందిస్తున్నారు.

Related posts