telugu navyamedia
సినిమా వార్తలు

“మార్కెట్లో ప్రజాస్వామ్యం” వస్తోంది

Narayanamurty,Prajaswamya Movie Release
నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్ . నారాయణ మూర్తి డి తెలుగు సినిమాలో విభిన్నమైన శైలి . వామ పక్ష భావాలతో వుండే నారాయణ మూర్తి దాసరి నారాయణ రావు తన “నీడ ‘సినిమాతో నటుడుగా పరిచయమా చేశారు . 
ఆ తరువాత అనేక  సినిమాల్లో నటించాడు . 1984లో స్నేహ చిత్ర సంస్థ ను ప్రారంభించి “అర్ధరాత్రి స్వతంత్రం “సినిమా ను నిర్మించి దర్శకత్వం వహించాడు . ఆ తరువాత 28 సినిమాలు తనదైన పద్దతిలో నిర్మించాడు . నటుడుగా బయటి సినిమాల్లో అవకాశం వచ్చినా చెయ్యలేదు .ఇటీవల చదలవాడ శ్రీనివాసరావు  దర్శకత్వం వహించిన సినిమాలో మాత్రం కానిస్టేబుల్ గా నటించాడు . 
నారాయణ మూర్తి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తనదైన సినిమాలనే రూపొందిస్తున్నాడు . సమకాలీన సమస్యలపై నారాయణ మూర్తి సినిమాలు తీస్తుంటాడు . తాజాగా “మార్కెట్లో ప్రజాస్వామ్యం ” అనే సినిమాకు దర్శకత్వం వహించాడు . నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. .ప్రస్తుతం ఎడిటింగ్ పనులు జరుగుతున్నాయి . వచ్చే నెలలో విడుదల చెయ్యాలనే సంకల్పంతో వున్నాడు . 

Related posts